Thursday, January 8, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్కాంగ్రెస్ నుంచి అన్నం శ్రీశైలం సస్పెండ్..

కాంగ్రెస్ నుంచి అన్నం శ్రీశైలం సస్పెండ్..

- Advertisement -

నవతెలంగాణ – మునుగోడు
కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థి అద్దంకి రామలింగయ్యకు ప్రచారం చేయకుండా బిఆర్ఎస్ నుండి పోటీ చేసిన అభ్యర్థికి ప్రచారం చేసిన అయితగోని సైదులు అన్నం శ్రీశైలం ను కాంగ్రెస్ నుండి సస్పెండ్ చేస్తున్నట్లు కొరటికల్ కాంగ్రెస్ గ్రామ శాఖ అధ్యక్షుడు దండు లింగస్వామి ప్రకటించారు. బుధవారం ఆ గ్రామంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ఇటీవల జరిగిన సర్పంచ్ ఎన్నికలలో  కాంగ్రెస్ కు నష్టం కలిగించేందుకు పార్టీకి వ్యతిరేకంగా పనిచేసి , ఎన్నికలు అయిపోయిన తర్వాత మళ్లీ  కాంగ్రెస్ కార్యకర్తల మంటూ చెప్పుకుంటున్న అయితగోని సైదులు, అన్నం శ్రీశైలం కు కాంగ్రెస్ తో ఎలాంటి సంబంధం లేదని అన్నారు. కాంగ్రెస్ కు నష్టం కలిగించే వ్యతిరేక కార్యక్రమాలు ఎవరు చేసిన మండల కమిటీ సూచనల మేరకు చర్యలు ఉంటాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ అద్దంకి రామలింగయ్య , ఉపసర్పంచ్ మందుల అంజయ్య , వార్డు సభ్యులు పార్టీ ముఖ్య నాయకులు తదితరులు ఉన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -