Sunday, October 19, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్బోనస్‌ ప్రకటించడం హర్షనీయమైన నిర్ణయం

బోనస్‌ ప్రకటించడం హర్షనీయమైన నిర్ణయం

- Advertisement -

ఆలూర్ సొసైటీ చైర్మన్ తాంబూరి శ్రీనివాస్‌
నవతెలంగాణ – ఆర్మూర్

రైతుల సంక్షేమమే ప్రభుత్వ ప్రధాన ధ్యేయమని, రైతులు పండించిన ప్రతి గింజను మద్దతు ధరకు ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని ఆలూర్ మండల ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం చైర్మన్ తాంబూరి శ్రీనివాస్‌ శుక్రవారం తెలిపారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. రైతులకు అదనపు ప్రోత్సాహకంగా ప్రభుత్వం ప్రతి క్వింటాలుకు రూ.500 బోనస్‌ను ప్రకటించడం హర్షనీయమని అన్నారు. ఈ నిర్ణయం రైతుల ఆర్థిక స్థితిని మెరుగుపరచడంలో ఎంతో దోహదపడుతుందని పేర్కొన్నారు. రైతులు తగిన తేమశాతం కలిగిన, పరిశుభ్రమైన ధాన్యాన్ని మాత్రమే కొనుగోలు కేంద్రాలకు తీసుకురావాలని సూచించారు. దళారులను ఆశ్రయించకుండా నేరుగా ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల ద్వారా విక్రయిస్తే నష్టం తప్పి, లాభాలు చేకూరుతాయని చెప్పారు.

రైతుల సౌకర్యార్థం ఆలూర్ మండలంలోని ప్రతి గ్రామంలో కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. తగిన వసతులు, తూకం సదుపాయాలు, నిల్వ కేంద్రాలు ఏర్పాటు చేయబడినందున రైతులు వాటిని సద్వినియోగం చేసుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వము తీసుకున్న ఈ నిర్ణయం పట్ల రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారని, న్యాయమైన ధరతో పాటు బోనస్‌ కూడా అందుతుండటంతో రైతులకు రెండింతల ఆనందం నెలకొన్నదని తెలిపారు. రైతుల తరపున, ప్రజల తరపున ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -