– సుక్మా జిల్లాలో 26 మంది లొంగుబాటు
నవతెలంగాణ -చర్ల
మావోయిస్టులకు మరో భారీ ఎదురుదెబ్బ తగిలింది. ఛత్తీస్‌గఢ్ లోని సుక్మా జిల్లాలో 26 మంది మావోయిస్టులు సుక్మాలోని రిజర్వ్ స్టేషన్‌లో సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ కిరణ్ చవాన్ ఎదుట బుధవారం లొంగిపోయారు. లొంగిపోయిన వారిలో సీవైపీసీఎం (కంపెనీ డిప్యూటీ కమాండర్) 1, డీవీసీఎం (డివిజనల్ కమిటీ సభ్యులు) ఒకరు, పీపీసీఎం (ప్లాటూన్ పార్టీ కమిటీ సభ్యులు) 3, ఏసీఎం (ఏరియా కమిటీ సభ్యులు) 3, పార్టీ సభ్యులు, ఇతరులు 18 మంది ఉన్నారు. కాగా, వీరందరి పై రూ.10లక్షల నుంచి రూ.5లక్షల వరకు రివార్డులున్నాయి. వీరు పాల్గొన్న ఎన్‌కౌంటర్లలో ఎంతోమంది పోలీసులు, సైనికులు మృతి చెందారు. ఛత్తీస్ గఢ్ ప్రభుత్వం అమలుచేస్తున్న ”నక్సలైట్ లొంగు బాటు, పునరావాస విధా నం”, సుక్మా పోలీసుల ”పునా మార్గెము” ప్రచారం సానుకూల ఫలితాలు చూపిస్తున్నాయని పోలీస్ సూపరింటెం డెంట్ కిరణ్ చవాన్ తెలిపారు.
మావోయిస్టులకు మరో ఎదురు దెబ్బ
- Advertisement -
- Advertisement -



