– మెకానిక్ షాపులో ఎగిసిపడిన మంటలు
– మూడు కార్లు దగ్ధం
నవతెలంగాణ- మెహిదీపట్నం
ఇటీవల హైదరాబాద్ నాంపల్లి పరిధిలో ఓ ఫర్నీచర్ షోరూంలో జరిగిన భారీ అగ్నిప్రమాదంలో ఐదుగురు మృతిచెందిన సంగతి తెలిసిందే. ఈ ఘటన మరిచిపోకముందే అదే ప్రాంతంలో మరో అగ్ని ప్రమాదం జరిగింది. నాంపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని విజయనగర్ కాలనీలో మంగళవారం తెల్లవారుజామున ఓ కారు మెకానిక్ షాపులో మంటలు ఎగసిపడ్డాయి. మూడు కార్లు పూర్తిగా దగ్ధమయ్యాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని నాలుగు ఫైర్ ఇంజిన్లతో మంటలను అదుపులోకి తీసుకొచ్చింది. షార్ట్ సర్క్యూట్ కారణంగానే ప్రమాదం సంభవించి ఉండొచ్చని ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు. నాంపల్లి పోలీసులు కేసు దర్యాప్తు చేపట్టారు.
నాంపల్లిలో మరో అగ్నిప్రమాదం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



