అగ్ర కథానాయకుడు చిరంజీవి, దర్శకుడు అనిల్ రావిపూడి కాంబోలో రూపొందిన చిత్రం ‘మన శంకర వర ప్రసాద్ గారు’. సంక్రాంతి బరిలో విడుదలైన ఈ చిత్రం విశేష ప్రేక్షకాదరణతో సంచలన విజయం సాధించింది. ఇక ఈ సినిమా డిజిటల్ వరల్డ్‌లోనూ మరో రికార్డును బద్దలు కొట్టింది. సంక్రాంతి సందర్భంగా థియేటర్లలో అద్భుతాలు సృష్టించి, ప్రపంచవ్యాప్తంగా 400 కోట్లకు పైగా వసూళ్లతో బిగ్గెస్ట్ రీజినల్ హిట్‌గా నిలిచిన ఈ చిత్రం ఇప్పుడు జీ5లో అదరగొడుతోంది.
డిజిటల్‌లో విడుదలైన కేవలం 24 గంటల్లోనే, 200 మిలియన్లకు పైగా స్ట్రీమింగ్ మినిట్స్ నమోదు చేసింది. ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లో ఒక తెలుగు చిత్రానికి ఇప్పటివరకు లభించిన బిగ్గెస్ట్ ఓపెనింగ్‌గా నిలిచింది. ఈ అద్భుతమైన నెంబర్ సినిమాపై ప్రేక్షకులలో ముఖ్యంగా ఫ్యామిలీ ఆడియన్స్ ఎగ్జైట్‌మెంట్‌ని ప్రజెంట్ చేస్తోంది. ఇప్పుడు ఈ సినిమా ఈ అరుదైన రికార్డ్‌ని సొంతం చేసుకుంది. థియేటర్లలో, ఓటీటీలోనూ ఈ సినిమా తనదైన ల్యాండ్‌మార్క్‌ని క్రియేట్ చేసింది.
ట్విన్స్‌కి నామకరణం
ఇటీవల జరిగిన సంప్రదాయ నామకరణ వేడుకలో రామ్ చరణ్, ఉపాసన కొణిదెల దంపతులు తమ ట్విన్స్ పేర్లను ప్రకటించారు. చిరంజీవి సోషల్ మీడియాలో ఈ పేర్ల అర్థాలను వివరించారు.
శివరామ్ కొణిదెల, అన్వీరా దేవి కొణిదెల అని నామకరణం చేశాం. శివరామ్ అనే పేరు రెండు శాశ్వత విలువల కలయిక. ‘శివ’ అనేది శివ శంకర వరప్రసాద్ ప్రేరణతో, అంతర్ముఖ శక్తి, ఆధ్యాత్మిక లోతు, ప్రశాంతతను సూచిస్తుంది. ‘రామ్’ అనేది రామ్ చరణ్ నుండి తీసుకున్నది. ధర్మం, కరుణ, నైతిక ధైర్యానికి ప్రతీక. ఈ రెండు కలిసి అంతర్గత శక్తి, బాధ్యతాయుతమైన సమతౌల్యాన్ని సూచిస్తాయి. అన్వీరా దేవి దివ్యమైన స్త్రీశక్తికి ప్రతిరూపం. అన్వీరా అంటే నిర్భయత్వం, పట్టుదల, దైవ రక్షణ. కనకదుర్గ దేవి ఆశీస్సులతో ప్రేరణ పొందిన ఈ పేరు, సౌందర్యం, ధైర్యం, అచంచలమైన శక్తిని ప్రతిబింబిస్తుంది.



