Thursday, January 8, 2026
E-PAPER
Homeఖమ్మంబీఆర్ఎస్ పార్టీకి మరో షాక్ …మరో ముగ్గురు..

బీఆర్ఎస్ పార్టీకి మరో షాక్ …మరో ముగ్గురు..

- Advertisement -

నవతెలంగాణ ఖమ్మం: కేటీఆర్ ఖమ్మం జిల్లా పర్యటన రోజే ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీకి మరో షాక్ తగిలింది. ఇవాళ మరో ముగ్గురు గులాబీ కార్పొరేటర్లు కాంగ్రెస్‌లో చేరడానికి సిద్ధమైనట్టు సమాచారం. రెండు రోజుల కిందటే ఐదుగురు మహిళా కార్పొరేటర్లు బీఆర్ఎస్‌కు రాజీనామా చేసి కాంగ్రెస్‌ తీర్ధం పుచ్చుకున్న సంగతి తెలిసిందే. కాగా నేడు మరో ముగ్గురు హస్తం కండువా కప్పుకునేందుకు సిద్ధమవడం రాష్ట్ర వ్యాప్తంగా హాట్ టాపిక్‌గా మారింది. మరో పక్క గ్రామ పంచాయతీ ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ మద్దతుతో గెలుపొందిన సర్పంచ్‌లు, ఉప సర్పంచ్‌లను సన్మానించేందుకు ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ నేడు కేటీఆర్‌ ఖమ్మం వస్తున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -