Monday, January 12, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంపూలే అంబేద్కర్‌ స్ఫూర్తితో కుల వ్యతిరేక సాంస్కృతిక ఉత్సవాలు

పూలే అంబేద్కర్‌ స్ఫూర్తితో కుల వ్యతిరేక సాంస్కృతిక ఉత్సవాలు

- Advertisement -

కులవివక్ష, అంటరానితనం లేని గ్రామాలుగా తీర్చిదిద్దుదాం
రాజ్యాంగ హక్కులు రక్షించుకోవడానికి యువత సిద్ధం కావాలి : కేవీపీఎస్‌ రాష్ట్ర విస్తృత సమావేశంలో అవాజ్‌ రాష్ట్ర కార్యదర్శి ఎండీ అబ్బాస్‌
కేవీపీఎస్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టి.స్కైలాబ్‌ బాబు
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌

తరతరాలుగా కొనసాగుతున్న కుల వివక్ష, అంటరానితనాన్ని రూపుమాపడానికి అన్ని కులాల్లోని చదువుకున్న విద్యావంతులు, యువకులు కుల వ్యతిరేక సాంస్కృతిక ఉత్సవాల్లో భాగస్వాములు కావాలనీ, తద్వారా కుల నిర్మూలనకు పాటుపడాలని ఆవాజ్‌ రాష్ట్ర కార్యదర్శి ఎం.డి అబ్బాస్‌, కేవీపీఎస్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టి.స్కైలాబ్‌ బాబు పిలుపుని చ్చారు. ఆదివారం హైదరాబాద్‌ ముషీరాబాద్‌లోని సీఐటీయూ కార్యాల యంలో కేవీపీఎస్‌ రాష్ట్ర స్థాయి విస్తృతసమావేశం నిర్వహిం చారు. ఈ సమా వేశానికి కేవీపీఎస్‌ రాష్ట్ర ఉపాధ్యక్షులు పాలడుగు నాగార్జున నందిపాటి మనో హర్‌, పల్లెర్ల లలితలు అధ్యక్ష వర్గంగా వ్యవహరిం చారు. ఇటీవల కాలంలో మరణించిన వారికి సమావేశం రెండు నిమిషాలు మౌనం పాటించి శ్రద్ధాంజలి ఘటించింది. అనంతరం ఆవాజ్‌ రాష్ట్ర కార్యదర్శి ఎం.డి.అబ్బాస్‌ మాట్లాడుతూ దేశంలో విద్వేష ఉన్మాద పరిస్థితులు పెచ్చరిళ్లుతున్నాయని అధికారంలో ఉన్న పార్టీ వాటికి అండదండగా నిలుస్తూ పెంచి పోషిస్తుందని చెప్పారు ఎన్సీఆర్‌బీ లెక్కల ప్రకారం దళితులపై గత ఐదేండ్ల కాలంలో 6 లక్షల దౌర్జన్యాలు జరిగాయని తెలిపారు. నెలకు సగటున 10 వేల దాడులు జరుగు తున్నాయని చెప్పారు. కుల దురహ ంకార హత్యలు 143కు చేరుకున్నప్పటికీ కులాంతర వివాహితులకు రక్షణ చట్టం చేయడం లేదని ఆయన విమర్శించారు. ఇప్పటికీ తెలంగాణలో వీడీసీల పేరిట నిజామాబాద్‌ కామారెడ్డి జగిత్యాల, నిర్మల్‌ జిల్లాల్లోని సుమారు 200 గ్రామాల్లో వీడీసీల దౌర్జ న్యాలు, సాంఘిక బహిష్కరణ కొనసాగుతు న్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. నేటికీ కొనసాగు తున్న కుల వివక్ష, అంటరా నితనాన్ని రూపుమా పడానికి అన్ని కులాల్లోని విద్యా ర్థులు, యువకులు దానిపై తిరుగుబాటు బావుట ఎగురవేయాలని పిలుపు నిచ్చారు. కులవివక్ష సమస్య కేవలం దళితుల ది మాత్రమే కాదనీ, అది దేశ సమస్య అనీ, దేశంలోని ప్రతి పౌరుడు కుల సమస్యను ప్రతిఘటించాలని సూచించారు.

టి.స్కైలాబ్‌ బాబు మాట్లాడుతూ ఏప్రిల్‌లో జరగనున్న పూలే అంబేద్కర్‌ జయంతులను పురస్కరించుకొని అన్ని గ్రామాల్లోని విద్యావంతులు, యువకులను సమీకరించి నాలుగు నెలల పాటు కుల వ్యతిరేక సాంస్కృతిక ఉత్సవాలు నిర్మిం చనున్నట్టు చెప్పారు. విద్యావంతులు ఉద్యోగులు, మేధావులు, వివిధ సామాజిక సంఘాల నాయకులు ఈ ఉత్సవ కార్యక్రమాలకు సంపూర్ణ సహకార అందించాలని కోరారు. గ్రామాలను కులవివక్ష, అంటరానితనం లేని గ్రామాలుగా, కులం పేరుతో దాడులు, దౌర్జన్యాలు జరగని గ్రామాలుగా ఆదర్శ పంచాయతీలుగా తీర్చిదిద్దుకోవటానికి యువతరం ముందుకు రావాలని పిలుపునిచ్చారు. దాడులు, లైంగిక దాడులు, సామూహిక లైంగిక దాడులు కులం పేరుతో మనిషిని హీనంగా చూసే దుష్ట సంస్కృతిపై యువతరం ఉద్యమించాలని సూచిం చారు. రాజ్యాంగ లక్ష్యాలను ప్రమాదపు టంచుల్లో ముంచుతున్న మనువాద విధానాలపై తిరుగుబాటు చేయాలన్నారు. ఆర్‌ఎస్‌ఎస్‌, బీజేపీ విధానాలు దేశానికి మరింత ప్రమాదకరంగా మారి దేశంలో పేదల ఐక్యతకు విఘాతం కలిగిస్తున్నాయని విమర్శించారు. ఏప్రిల్‌ నెలలో రాష్ట్రస్థాయి సాంస్క తిక ఉత్సవాలు హైదరాబాదులో నిర్వహించనున్నట్టు ఆయన చెప్పారు. ఈ కుల వ్యతిరేక ఉత్సవాల్లో శ్రేయోభిలాషులు, విద్యావంతులు మేధావులు పెద్ద సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో కేవీపీఎస్‌ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎం కురుమయ్య, కోట గోపి, మంద సంపత్‌, ఎం ప్రకాష్‌ కరత్‌, డి.రాధాకష్ణ, రాష్ట్ర సహాయ కార్యదర్శులు టి.సురేష్‌, దుర్గం దినకర్‌, యు.మల్కయ్య, పి.అశోక్‌, పి.పరుశరాములు, వివిధ జిల్లాల కార్యదర్శులు బి.బాలకిషన్‌, బి.సుబ్బారావు, ఎన్‌.బాలపీరు, కొండ గంగాధర్‌, అన్నంపట్ల కృష్ణ, మందుల యాకూబ్‌, పోశెట్టి, వెంకటేష్‌ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -