Thursday, February 12, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్కార్మిక వ్యతిరేక చట్టాలను రద్దు చేయాలి

కార్మిక వ్యతిరేక చట్టాలను రద్దు చేయాలి

- Advertisement -

నవతెలంగాణ – నవీపేట్
కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం తీసుకువచ్చిన కార్మిక వ్యతిరేక చట్టాలను వెంటనే రద్దు చేయాలని సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు నాయక్ వాడి శ్రీనివాస డిమాండ్ చేశారు. దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెలో భాగంగా మండల కేంద్రంలోని మండల పరిషత్ కార్యాలయం వద్ద సిఐటియు ఆధ్వర్యంలో రైతు సంఘం, వ్యవసాయ కార్మిక సంఘం, కెవిపిఎస్, జన విజ్ఞాన వేదిక తదితర ప్రజా సంఘాల ఆధ్వర్యంలో గురువారం ధర్నా నిర్వహించారు.

ఈ సందర్భంగా సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు నాయక్ వాడి శ్రీనివాస మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం వ్యతిరేక విధానాలను అవలంబిస్తూ 2018లో 4 లేబర్ కోడ్లను తీసుకువచ్చి ఉపాధి హామీ పథకాన్ని రద్దుచేసి జి రామ్ జి పేరుతో పతకాన్ని తీసుకోవచ్చి కార్మికుల పొట్ట కొట్టే ప్రయత్నం చేస్తుందని అన్నారు. అలాగే నూతన విద్యుత్ సవరణ, విత్తన బిల్లులను తీసుకు రావడం వెనుక ఆంతర్యం ఏమిటని ప్రశ్నించారు. కేవలం ఆదాని, అంబానీ లాంటి కార్పొరేట్లను ప్రోత్సహించేందుకే ఇటువంటి చట్టాలను తీసుకువస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు.

వెంటనే చట్టాలను రద్దుచేసి కార్మికుల సంక్షేమం కోసం కృషి చేయాలని లేనియెడల ఆందోళనలను ఉదృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో రైతు సంఘం జిల్లా ఉపాధ్యక్షులు దేవేందర్ సింగ్, లిఫ్ట్ ఇరిగేషన్ జిల్లా అధ్యక్షులు గణేష్ గుప్తా, వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు భూమయ్య, కెవిపిఎస్ మండల కార్యదర్శి గౌతమ్, గ్రామపంచాయతీ వర్కర్స్ యూనియన్ అధ్యక్షులు మేకల ఆంజనేయులు, ఉపాధి హామీ పథకం కార్మికులు మహబూబ్, ఆశ వర్కర్ యూనియన్ మండల అధ్యక్షురాలు సబిత, ఇంద్ర, జనవిజ్ఞాన వేదిక హెల్త్ కన్వీనర్ రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -