కార్మిక, ప్రజా వ్యతిరేక విధానాలు ఉపసంహరించుకోవాలి
బీజేపీ ప్రభుత్వ కార్మిక విధానాలను ప్రతిఘటిద్దాం
జాతీయ, రాష్ట్ర కార్మిక సంఘాలు, స్వతంత్ర ఫెడరేషన్లు, అసోసియేషన్ల పిలుపు
సిఐటియు జిల్లా కార్యదర్శి నూర్జహాన్
నవతెలంగాణ – కంఠేశ్వర్ : కార్మిక వ్యతిరేక నాలుగు లేబర్ కోడ్ను రద్దు చేయాలని కార్మిక ప్రజావ్యతిరేక విధానాలను ఉపసంహరించుకోవాలని, కేంద్ర బిజెపి ప్రభుత్వ కార్మిక విధానాలను ప్రతిఘటించాలని జాతీయ రాష్ట్ర కార్మిక సంఘాలు స్వాతంత్ర ఫెడరేషన్లు అసోసియేషన్లు పిలుపునిచ్చాయని సిఐటియు జిల్లా కార్యదర్శి నూర్జహాన్ తెలిపారు. ఏ మేరకు శుక్రవారం సిఐటియు జిల్లా కార్యాలయంలో జిల్లా విస్తృత సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా కార్యదర్శి నూర్జహాన్ మాట్లాడుతూ..కేంద్రంలో మూడవసారి అధికారంలోకి వచ్చిన బిజెపి నాయకత్వంలోని ఎన్డీఎ ప్రభుత్వం తన కార్మిక, ప్రజా వ్యతిరేక విధానాలను మరియు కార్పొరేట్ అనుకూల, మతోన్మాద చర్యలను మరింత దూకుడుగా అమలు చేస్తున్నది. కార్మికవర్గం సమరశీల పోరాటాల ద్వారా 100 సంవత్సరాలలో సాధించుకొన్న 29 కార్మిక చట్టాలను రద్దు చేసి, వాటి స్థానంలో 4 లేబర్ కోడ్లను ముందుకు తెచ్చింది. వీటికి వ్యతిరేకంగా గత ఐదేళ్ళుగా కార్మికవర్గం చేస్తున్న ఆందోళనా, పోరాటాలతో లేబర్ కోడ్ల అమలు 5 సం. ఆలస్యమైనా, ఇప్పుడు వాటిని అమలు చేసి కార్మిక కార్మిక హక్కులను పూర్తిగా హరించే ప్రయత్నం చేస్తున్నది. 2025-26 బడ్జెట్లో తమ కార్పొరేట్ అనుకూల విధానాలకు అనుగుణంగా కేటాయింపులు చేసింది. సామాజిక సంక్షేమానికి కోతలు పెట్టింది. సామాన్యులపై భారాలు మోపి, కార్పొరేట్ గుత్త సంస్థలకు, పెట్టుబడిదారులకు వేల కోట్ల రాయితీలు ప్రకటించింది. ప్రభుత్వ విద్య, వైద్యం, గ్రామీణ ఉపాధి హామీ, ఐసిడిఎస్ పథకాలకు వార్షిక బడ్జెట్లలో కోతపెడ్తున్నారు. గత 10 సం|| కాలంలో రూ.16,35,000 కోట్లు కార్పొరేట్ల పన్ను మాఫీ రూపంలో లబ్ది చేకూర్చారు. కార్పొరేట్ సంస్థలకు ఎన్పీఎ పేరిట బ్యాంక్ రుణాలు వేల కోట్లు రద్దు చేశారు. అంతటితో ఆగకుండ ఉత్పత్తితో లింక్డ్ ఇన్సెంటివ్ పేరున 1.97 లక్షల కోట్లు, పెట్టుబడి ఇన్సెంటివ్గా 97,000 కోట్లు, ఉద్యోగ కల్పన ఇన్సెంటివ్ కోసం రూ.2 లక్షల కోట్లు కేటాయించినా ఒక్క కొత్త ఉద్యోగం రావడంలేదు. ఉత్పత్తి కూడా పెరగకపోవడం శోచనీయం సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు కల్పిస్తామన్న కేంద్ర బిజెపి ప్రభుత్వం ఆ పని చేయకపోగా ఉన్న ఉద్యోగాలకు తీసివేయాలని ప్రయత్నాలు చేస్తుంది. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా అధ్యక్షుడు శంకర్ గౌడ్, ఉపాధ్యక్షులు నన్నేసావ్, సిఐటియు జిల్లా నాయకులు నరసయ్య, తదితరులు పాల్గొన్నారు.
కార్మిక వ్యతిరేక లేబర్ కోడ్ లను రద్దు చేయాలి..
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES