నవతెలంగాణ- రాయపోల్ : ఆశ వర్కర్ల సమస్యలు పరిష్కరించాలని తెలంగాణ ఆశా వర్కర్ల యూనియన్ రాష్ట్ర కమిటీ పిలుపుమేరకు చలో హైదరాబాద్ కార్యక్రమానికి పిలుపునిచ్చారు. చలో హైదరాబాద్ కార్యక్రమాన్ని అడ్డుకోవడానికి సోమవారం ఆశా వర్కర్లను ముందస్తు అరెస్టు చేసి పోలీస్ స్టేషన్ కు తరలించడం జరిగిందని రాయపోల్ చేస్తే కుంచం మానస తెలిపారు. అనంతరం ఆశ వర్కర్ల యూనియన్ మండల అధ్యక్షురాలు సుజాత మాట్లాడుతూ మాట్లాడుతూ రాష్ట్ర కమిటీ పిలుపుమేరకు ఆశ వర్కర్ల సమస్యలు పరిష్కరించాలని చలో హైదరాబాద్ కార్యక్రమం అడ్డుకోవడానికి పోలీసులు ముందస్తుగా అరెస్టు చేయడాన్ని ఖండిస్తున్నామన్నారు.ఆశ వర్కర్లు పని చేయటం లేదని, పారితోషికాలు తగ్గించాలనే వ్యతిరేకమైన విధానాన్ని తక్షణమే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు.పారితోషికాలు తగ్గించకూడదు. గతంలో చెల్లించినట్లు మొత్తం డబ్బులు ప్రతి నెల చివరి నాటికి ఖాతాలో జమ చేయాలన్నారు.కేంద్రం పెంచిన పారితోషికాలు యధావిధిగా రాష్ట్రంలో అమలుచేయాలన్నారు.రాష్ట్ర ప్రభుత్వం ఫిక్సిడ్ వేతనం రూ.18 వేలు నిర్ణయించాలన్నారు.6 నెలల పి.ఆర్.సి బకాయిలు, లేప్రసి, టీబీ, పల్స్ పోలియో పెండింగ్ డబ్బులు, యూనిఫామ్స్ వెంటనే ఇవ్వాలన్నారు.స్పూటం డబ్బాలు మోయటం, ఎ.ఎన్.సి తదితర టార్గెట్స్ రద్దు చేయాలనీ, ఆదివారం, పండగ సెలవులు నిర్ణయించాలన్నారు.50 లక్షల ఇన్సూరెన్స్, రిటైర్మెంట్ బెనిఫిట్స్, పెన్షన్, ప్రమోషన్స్, మట్టి ఖర్చులు తదితర హామీలు వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఆశ వర్కర్లు నవిత, యాదమ్మ, భాగ్యలక్ష్మి, రజిత, వనజ, బాలమణి, సునీత, మార్త తదితరులు పాల్గొన్నారు.
ఆశ వర్కర్ల ముందస్తు అరెస్టు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES