యలమర్తి అనూ’రాధ ‘ పిల్లల కోసం వెదజల్లిన కథా ‘సుధ ‘ పసి మొగ్గలు. బి.యస్సీ హౌం సైన్స్ చేసినా అమే ‘డ్రీం సెన్శ్ నలభై ఐదేళ్ళ సాహితీ వ్యవసాయం రచనా వ్యాసంగం.
అనూరాధ ‘అంబులపొదిలో’ సాహితీ సామాగ్రి సవా లక్ష. అందుకే వందలాది కథలు, కవితలు, వ్యాసాలు రాశారు. ఒకే ఏడాదిలో ఐదు ప్రభుత్వ పురస్కారాలు, ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారి దగ్గర ఉగాది పురస్కారం, 100 కి పైగా వివిధ సంస్థల అవార్డులు అందుకున్నారు. ఆంధ్ర భూమిలో ఆమె వేసిన ‘పచ్చ బొట్టు ‘, విలువల లోగిలిని ‘ తెరిచింది. తానా సభలకు అమెరికాకు స్పెషల్ గెస్ట్ గా పిలిచింది.
‘పుస్తకాల రీడింగే’ కాదు ‘మస్తకాల రీడింగు ‘ అనూరాధకు ఇష్టం. అందుకే అన్నన్ని పత్రికలలో ఎన్నెన్నో శీర్షికలు నిర్వహించారు. ‘ఈగ ‘ వాలినా ‘డేగ ‘ వాలినట్లు హడావుడి చేసే ఈ రోజుల్లో బోలెడు రచనలు చేసినా అనూరాధ ‘చిన్మయానందంతో’ పాటు ‘పెన్మయానందం పొందుతారు.
సామాజిక స్పృహ వున్న రచనలు చేయడం, వ్యక్తి సంస్కరణ, స్త్రీ చైతన్యానికి కృషి చేయడం ఆమె లక్ష్యం. ఆ దిశగా నడిచే అనూరాధ రచనలకు ‘ఫోర్సెక్కువ ‘ ఆమె సృజనకు ‘పదునెక్కువ ‘.
అనూరధ తన ‘మైండ్ ‘ లోని ఊహలకు ‘సౌండ్’ కల్పించి అనేక కవితా సమ్మేళనాలలో పాల్గొన్నారు. లెక్కలేనన్ని సేవా కార్యక్రమాలు నిర్వహించారు. వివిధ రికార్డులు సాధించారు. ఇంత చేసినా ఆమె ‘లుక్స్ ‘ అన్నీ పిల్లల ‘బుక్స్ ‘ మీదనే వుంటాయి. అందుకే ‘పసి మొగ్గలు ‘ బాలల కథా సంపుటి సృజన!.
తనకిష్టమైన ‘గోరు ముద్దలు ‘ తినిపింరచటం కన్నా ‘ ఎదుటి వారు ‘కోరు ముద్దలు ‘ తినిపిస్తే ఫలితం బాగుంటుందని భావించి అంతగా జానపద కథల జోలికి పోకుండా సాంఘిక కథల సౌరభాన్ని ఆబాల గోపాలం ఆస్వాదించేలా పసి మొగ్గల ద్వారా అందించారు అనూరాధ.
అనూరాధ తన ‘మానస ‘ సరోవరంలో ‘అన్వేషించి వెలికి తీసిన మేలిమి ముత్యాలు ఈ పసిడి మొగ్గలు లోని 30 బాలల కథలు. చదివితే ఆ కథల ప్రాముఖ్యం మీరే తెలుసుకుంటారుగా! చదవబోతూ కథల వివరాలెందుకు? పదండి ముందుకు!!
- చొక్కాపు వెంకటరమణ, 9246520050



