- Advertisement -
ఉత్తమ సేవలు అవార్డు అందుకున్న ఏవో రాజు
నవతెలంగాణ – మద్నూర్
మీ సేవలు అమూల్యమైనవని మండల వ్యవసాయదారులు మండల అగ్రికల్చర్ ఆఫీసర్ రాజును అభినందించారు. స్వతంత్ర దినోత్సవం సందర్భంగా ఉత్తమ సేవలకు గాను మండల వ్యవసాయ అధికారి రాజుకు జిల్లా కలెక్టర్ చేతుల మీదుగా అవార్డు అందించడం అభినందనీయమని పేర్కొన్నారు. వ్యవసాయ శాఖ అధికారి వ్యవసాయదారులకు ఎల్లవేళలా అందుబాటులో ఉంటూ ఎప్పటికప్పుడు సేవలందించి వ్యవసాయ అభివృద్ధికి సలహాలు సూచనలు అందించడం ఏవో సేవలు అభినందనీయంగా మండల వ్యవసాయదారులు పేర్కొంటున్నారు.
- Advertisement -