నవతెలంగాణ – హైదరబాద్: నిజాం ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (నిమ్స్) లో మాస్టర్ ఇన్ హాస్పిటల్ మేనేజ్ మెంట్ (ఎంహెచ్ఎం) కోర్సుకు దరఖాస్తు తేదీ పొడిగిస్తునట్లు ఆసుపత్రి సూపరింటెండెంట్ ప్రొఫెసర్ నిమ్మ సత్యనారాయణ గారు ఓ ప్రకటనలో తెలిపారు. రెండేళ్ల కోర్సు తర్వాత ఆర్నెల్ల పాటు ఇంటర్న్ షిప్ చేయాల్సి ఉంటుందని, 20 సీట్లు మాత్రమే ఉన్నాయని పేర్కొన్నారు. డిగ్రీ కలిగిన అభ్యర్థులు జులై 10 తేదీ సాయంత్రం 5 గంటల లోపు ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకొని, ప్రతులను జులై 14 లోపు ఆసుపత్రిలో ఇవ్వాలని సూచించారు.
ఫీజు వివరాలు: రిజిస్ట్రేషన్ ఫీజు 5000 (OC/BC/EWS), 4000 (SC/ST), ప్రవేశ రుసుము 5000, సెక్యూరిటీ డిపాజిట్ 1000 (రిఫండబుల్), ట్యూషన్ ఫీజు 26, 250(ప్రతి సెమిస్టర్). మరిన్ని వివరాల కొరకు నిమ్స్ వెబ్ సైట్ nims.edu.in సందర్శించగలరని మరియు ఫోన్ నంబర్ 040 – 23489189 సంప్రదింపులు జరుపగలరని సూచించారు.