Thursday, October 9, 2025
E-PAPER
Homeకరీంనగర్2025- 27 మద్యం దుకాణాలకు దరఖాస్తుల స్వీకరణ 

2025- 27 మద్యం దుకాణాలకు దరఖాస్తుల స్వీకరణ 

- Advertisement -

ఎక్సైజ్ సీఐ ఏ రాకేష్ కుమార్
నవతెలంగాణ – రామగిరి

2025-27 సంవత్సరానికి సంబంధించిన మద్యం దుకాణాలకు మంథని పరిధిలో గల 15 మద్యం దుకాణాలకు దరఖాస్తులు స్వీకరిస్తున్నామనీ ఎక్సైజ్ సిఐ ఏ రాకేష్ కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు. దరఖాస్తులను ఈనెల 18 న, సాయంత్రం 5.00 గంటల వరకు జిల్లా ప్రోహిబిషన్ & ఎక్సైజ్ అధికారి కార్యాలయం, పెద్దపల్లిలో స్వీకరించబడుననీ అనారు.అలగే దరఖాస్తు తో పాటు, 3 లక్షల రూపాయల డిడి లేదా చలాను, దరఖాస్తుదారుడి 3 ఫోటోలు, దరఖాస్తుదారుడి ఆధార్, పాన్ కార్డు జిరాక్స్, రిజర్వేషన్ కలిగిన షాపుల కోసం కుల ధృవీకరణ పత్రం దరఖాస్తు ఫామ్ కి జత చేసి అందజేయాలని తెలిపారు.అలగే డిడి నీ జిల్లా ప్రోహిబిషన్, లేద ఎక్సైజ్ అధికారి పెద్దపల్లి పేరు మీద తీయలనీ తెలిపారు. స్థలం స్వరూప గార్డెన్స్, బంధంపల్లి, పెద్దపల్లి వద్ద నిర్వహించబడుననీ అన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -