Tuesday, November 11, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్26 వరకు నైపుణ్య శిక్షణకు దరఖాస్తులు ..

26 వరకు నైపుణ్య శిక్షణకు దరఖాస్తులు ..

- Advertisement -

నవతెలంగాణ- జోగిపేట: సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల, కాలేజీలలో చదువుతున్న, చదువు పూర్తి చేసుకున్న పూర్వ విద్యార్థులకు ఉపాధి కల్పన లక్ష్యంగా నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు అందోల్  సాంఘిక సంక్షేమ బాలికల గురుకుల పాఠశాల ప్రిన్సిపాల్ పి. లింగారెడ్డి  తెలిపారు. శనివారం ఆయన స్థానిక విలుకులతో మాట్లాడారు. సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ కార్యదర్శి అలుగు వర్షిని  ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారన్నారు. ఉన్నతి ఫౌండేషన్ సహకారంతో విద్యార్థులకు ఉచితంగా నైపుణ్యాభివృద్ధి శిక్షణ ఉంటుందన్నారు. 18 నుండి 25 సంవత్సరాలు వయసు కలిగిన విద్యార్థులు శిక్షణకు అర్హులు అన్నారు. జూన్ మాసంలో రాష్ట్రవ్యాప్తంగా 239 సాంఘిక సంక్షేమ గురుకుల విద్యార్థులకు శిక్షణ ఇవ్వనున్నట్లు తెలిపారు. ప్రస్తుతం చదువుకుంటున్న విద్యార్థులతో పాటు, చదువు పూర్తి చేసుకున్న విద్యార్థుల సైతం నిబంధనల ప్రకారము శిక్షణకు అర్హులన్నారు. అనంతరం ఉపాధి ఉద్యోగ అవకాశాలు కల్పించనున్నట్లు పేర్కొన్నారు. పదవ తరగతి, ఇంటర్మీడియట్, ఐటిఐ, పాలిటెక్నిక్, డిగ్రీ పూర్తి చేసిన, డిగ్రీ ఫైనల్ ఇయర్ చదువుతున్న విద్యార్థులతో పాటు చదువు మధ్యలో మానేసి 18 సంవత్సరాల నుండి 25 సంవత్సరాలు వయసు కలిగిన వారు ఈ శిక్షణకు అర్హులన్నారు. శిక్షణకు హాజరయ్యే విద్యార్థులు  గురుకుల పాఠశాల, కాలేజీలో ఈ నెల 26 వరకు తమ పేర్లను రిజిస్ట్రేషన్ చేసుకోగలరని, పూర్తి వివరాలు పాఠశాలను సంప్రదించగలరనీ ఆయన తెలిపారు. 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -