Friday, September 26, 2025
E-PAPER
Homeవరంగల్వైన్ షాపులకు  దరఖాస్తులు షురూ

వైన్ షాపులకు  దరఖాస్తులు షురూ

- Advertisement -

దరఖాస్తు ఫీజు రూ.3 లక్షలు
-లాటరీ ద్వారా దుకాణాల కేటాయింపు
నవతెలంగాణ-మల్హర్ రావు
వైన్ షాపుల లైసెన్సుల జారీకి రాష్ట్ర ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ మేరకు ఎక్సైజ్ కమిషనర్ గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. లక్కీ డ్రా ద్వారా దుకాణాలను కేటాయించి 2025 డిసెంబర్ 1 నుంచి 2027 న వంబర్ 30 కాలానికి లైసెన్స్ కేటాయిస్తారు.ప్రస్తుతమున్న వైన్ షాపులు నవంబర్ 30 వరకు కొనసాగనున్నాయి. కలెక్టర్ పర్యవేక్షణలో దుకాణాల కేటాయింపులో రిజర్వేషన్లను ఖరారు చేయనున్నారు.భూపాలపల్లి, ములుగు జిల్లాల్లో 59 మద్యం షాపులకు టెండర్లు ఆహ్వానించారు.మండలంలో తాడిచెర్ల, కొయ్యుర్ రెండు వైన్ షాపులున్నాయి. గౌడ కులస్తులకు 15 శాతం, ఎస్సీలకు 10, ఎస్టీలకు 5 శాతం రిజర్వేషన్ ఉంటుంది.రూ.3 లక్షల డీడీ చెల్లించి దరఖాస్తు ఫారం పొందాల్సి ఉంటుంది.ఆరు శ్లాబుల్లో జనాభా ప్రాతిపదికన మద్యం షాపుల లైసెన్స్ ఫీజు ఉండనుంది.శుక్రవారం నుంచి వచ్చే నెల 18 సాయంత్రం వరకు ఆబ్కారీ శాఖ ఆధ్వర్యంలో దరఖాస్తులు స్వీకరిస్తారు.23న డ్రా తీసి,డిసెంబర్ 2నుంచి రెండేళ్ల పాటు మద్యం షాపులు నడపనున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -