– రేకుల షెడ్డు ఉన్న షాపులకు మాత్రమే అనుమతి
– మున్సిపల్ కమీషనర్ నాగరాజు
నవతెలంగాణ – ఖమ్మం
దీపావళి పురస్కరించుకుని మున్సిపాల్టీ పరిధిలోని నీటిపారుదల శాఖ కార్యాలయం ప్రాంగణం ఖాలీ స్థలంలో నిర్వహించే బాణసంచా దుకాణాలు కు ఆసక్తి ఉన్న వ్యాపారులు దరఖాస్తు చేసుకోవాలని కమీషనర్ నాగరాజు మంగళవారం ప్రకటన ఒకటి విడుదల చేసారు. ఈ నెల 15 వ తేదీ బుధవారం నుండి 17 వ తేది శుక్రవారం మధ్యాహ్నం 4.00 గంటల వరకు మున్సిపాలిటీ కార్యాలయంలో దరఖాస్తులు సమర్పించాలని అందులో పేర్కొన్నారు. దుకాణాల నిర్వహణకు కావలసిన దృవీకరణ( సర్టిఫికెట్స్) ఈ దిగువ చూపిన విధంగా సమర్పించాలని అన్నారు.
2025 – 2026 ఆర్ధిక సంవత్సరంలో చెల్లించిన ఇంటి పన్ను రసీదు,నల్లా పన్ను రసీదు,నిర్వాహకుని ఆధార్, పాన్ కార్డుల నకలు,సెల్ఫ్ డిక్లరేషన్ ఫామ్,షాపు ట్రేడ్ లైసెన్స్ సర్టిఫికేట్,పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు (2),నక్ష కాపీలు (3) దరఖాస్తు తో సమర్పించాలని అన్నారు. దీపావళి బాణాసంచా దుకాణాల యజమానులు ఫైర్ యాక్సిడెంట్ నివారించుటకు అవసరమైన మంటల నిరోధించడానికి,ఇసుక నీరు, ఇతర ఎక్స్ టెంగ్విషర్ ఆవరణలో అందుబాటులో ఉంచుకోవాలని తెలిపారు.
ప్రతి దుకాణానికి ఇరువైపుల రెండు డ్రమ్ములలో నీరు, రెండు బకెట్లు ఇసుక సిద్దంగా ఉంచాలని,తెచ్చిన స్టాక్ మొత్తం ఎవరికి కేటాయించిన దుకాణంలో వారే నిల్వ చేయాలని,జనావాసాల లో గాని, ఇతర గోదాం లలో నిల్వ చేయకూడదని,ఏదైనా ప్రమాదం సంభవించిన యెడల అట్టి ప్రమాదం వలన నష్టపోయిన బాధితులకు నష్టపరిహారం చెల్లించవలసిన బాధ్యత అనుమతి పొందిన షాపు యజమాని పైనే ఉంటుందని,అట్టి ప్రమాదం షాపు యజమాని నిర్లక్ష్యం వలన జరిగినచో షాపు అనుమతి పొందిన షాపు యజమానిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకో బడతాయని,
120 మైథాన్ కన్నా తక్కువ ప్లాస్టిక్ కవర్ ను ఉపయోగించిన యెడల రూ.100 లు నుండి 5000 లు వరకు జరిమానా విధించ పడుతుందని, దుకాణం అనుమతి రద్దు చేయబడుతుంది అని హెచ్చరించారు. ప్రతి దుకాణము యజమాని గడువు ముగిసిన తరువాత స్థలమును శుభ్రపరచి తిరిగి అప్పగించాలని.లేని ఎడల రూ. 2000 లు జరిమానా విధించి శుభ్రం చేయించ బడుతుందని అన్నారు. కావున ఆసక్తి గలవారు పైన తెలిపిన సర్టిఫికెట్స్ సంబంధిత గడువు నందు దరఖాస్తు ఫారం తో సహా పురపాలక సంఘ కార్యాలయము నందు సమర్పించాలని తెలిపారు.
.



