టీజీఎన్పీడీసీఎల్‌కు రాష్ట్ర బీసీ కమిషన్ ఆదేశం
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
గతంలో 2014 నుంచి 2026 మధ్యన జరిగిన నియామకాల వివరాలను సమర్పించాలని ఉత్తర తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ (టీజీఎన్పీడీసీఎల్)ను రాష్ట్ర బీసీ కమిషన్ ఆదేశించింది. హనుమకొండలోని టీజీఎన్పీడీసీఎల్‌ను గురువారం కమిషన్ చైర్మెన్ జి.నిరంజన్, సభ్యులు రాపోలు జయప్రకాష్, తిరుమలగిరి సురేందర్, రంగు బాలలక్ష్మి సందర్శించారు. వివిధ పెండింగ్ కోర్టు కేసులకు సంబంధించిన వివరాల గురించి ఒక కమిటీ వేసి ఉద్యోగుల ప్రమోషన్లు, సీనియార్టీ, ఇతర అంశాలను పరిశీలించాలని వారు ఆదేశాలు జారీ చేశారు.
ఆ సంస్థలో బీసీ సెల్ ఏర్పాటు చేసి తగిన వసతి సౌకర్యాలు కల్పించాలని చైర్మెన్ ఆదేశిం చారు. సంస్థలో రిజర్వేషన్ల అమలులో బీసీలకు జరిగిన అన్యాయం, ఇతర అంశాల గురించి సుదీర్ఘంగా విచారణ జరిపారు. ఈ విచారణ కార్యక్రమంలో విద్యుత్ సంస్థ సీఎండీ కె.వరుణ్ రెడ్డి, డైరెక్టర్ (హెచ్‌ఆర్డీ) సి.ప్రభాకర్, ఇతర అధికారులు కె. మాధ వరావు, కె.తిరుమల్‌రావు, కె.రమేష్, డి.శ్రీనివా సరావు, తెలంగాణ ఎలక్ట్రిసిటీ బీసీ ఎంప్లాయిస్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శులు కె.కుమార స్వామి, వెంకన్న గౌడ్ తదితరులు పాల్గొన్నారు.
నియామక వివరాలు సమర్పించాలి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



