Friday, September 5, 2025
E-PAPER
spot_img
Homeజాతీయందర్గాలు మాత్రమే కనిపిస్తున్నాయా ?

దర్గాలు మాత్రమే కనిపిస్తున్నాయా ?

- Advertisement -

మిగిలిన ఆక్రమణల మాటేమిటి..
సేవ్‌ ఇండియా ఎన్‌జీఓపై ఢిల్లీ హైకోర్టు వ్యాఖ్యలు
న్యూఢిల్లీ :
యమునా నదీ పరీవాహక ప్రాంతాల్లో అక్రమ ఆక్రమణలు జరిగాయని ఆరోపణలు వస్తున్న మూడు దర్గాలు, మజార్‌ను తొలగించాల్సిందిగా కోరుతూ సేవ్‌ ఇండియా ఎన్‌జీఓ వేసిన పిటిషన్‌ను ఢిల్లీ హైకోర్టు బుధవారం కొట్టివేసింది. హిందూ మితవాద గ్రూపులకు చెందిన ఎన్‌జీఓ ఇది. ఆ సంస్థ వివరాలను ప్రశ్నిస్తూ ప్రధాన న్యాయమూర్తి డి.కె.ఉపాధ్యాయ, దర్గాలను మాత్రమే లక్ష్యంగా పెట్టుకోవడం పట్ల ఆందోళన వ్యక్తం చేశారు. అక్రమ ఆక్రమణలు జరిగాయంటూ దర్గాలనే ఎందుకు లక్ష్యంగా ఎంపిక చేసుకుంటున్నారని ఎన్‌జీఓను ప్రశ్నించారు. ఇతర ఆక్రమణలేవీ కనబడలేదా? కేవలం మజార్‌లను మాత్రమే ఎందుకు గుర్తించారు? అని ప్రశ్నించారు. దర్గాలను తొలగించాలని కోరుతూ ఇప్పటికి ఇది ఐదవదో లేక ఆరవదో ఇలా పిటిషన్‌ వేయడం, ఈ బెంచ్‌ విచారించడం..అని ప్రధాన న్యాయమూర్తి ఉపాధ్యాయ, జస్టిస్‌ తుషార్‌రావుతో కూడిన బెంచ్‌ వ్యాఖ్యానించింది. ప్రజలకు సేవ చేయాలనుకుంటే ఇంకా చాలా మార్గాలు, అవకాశాలు వున్నాయి, ఒకసారి కూర్చుని ఆలోచించుకుని, ఇంతకన్నా మెరుగైన సేవలు ఎలా అందించగలరో మీ ఫౌండేషన్‌కు సూచించాలని బెంచ్‌ పేర్కొంది. పౌర హక్కులకు సంబంధించిన అంశాలపై తమ సంస్థ పని చేస్తోందని సేవ్‌ ఇండియా ఫౌండేషన్‌ వ్యవస్థాపకుడు ప్రీత్‌ సింగ్‌ చెబుతారు. అయితే ముస్లిం కమ్యూనిటీకి వ్యతిరేకంగా విద్వేష ప్రచారాలు వ్యాప్తి చేస్తారని ఆయనపై అనేక ఆరోపణలు వున్నాయి. విద్వేష ప్రసంగానికి సంబంధించిన కేసులోనే సింగ్‌ ప్రస్తుతం బెయిల్‌పై వున్నాడు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad