Sunday, October 12, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్దాడిని సమర్థిస్తున్నారా.. విమర్శిస్తున్నారా 

దాడిని సమర్థిస్తున్నారా.. విమర్శిస్తున్నారా 

- Advertisement -

కెవిపిఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి జి.రాజు 
నవతెలంగాణ – జోగులాంబ గద్వా

సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి పై జరిగిన దాడిని బీజేపీ పెద్దలు సమర్థిస్తున్నారా.? విమర్శిస్తున్నారా.? దేశ ప్రజలకు తెలపాలని కెవిపిఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి జి.రాజు, సిఐటియు జిల్లా సహాయ కార్యదర్శి వెంకటేశ్వర్లు ప్రశ్నించారు. శనివారం ఉండవెల్లి మండల కేంద్రంలో అంబేద్కర్ విగ్రహం ఎదుట నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సనాతన వాదం పేరుతో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి అయినా బిఆర్ గవాయ్ పై దాడి చేయడానికి ప్రయత్నించడం సమంజసం కాదని అన్నారు. దేశంలో అత్యున్నత స్థాయి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి పై జరిగిన దాడితో అంతర్జాతీయ స్థాయిలో దేశం పరువు పోతుందని అన్నారు.

ప్రపంచ దేశాల ముందు తలదించుకునే పరిస్థితి సనాతనవాదులు కల్పిస్తున్నారని ఇలాంటి వారిపై కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపి ప్రభుత్వం కఠినంగా వ్యవహరించాలని అన్నారు. ప్రతిపక్ష పార్టీలు అధికారంలో ఉన్న రాష్ట్రాలలో గవర్నర్లు రాష్ట్రాల హక్కులను కాలరాసే విధంగా ప్రవర్తిస్తున్నారని శాసనసభలో చేసిన బిల్లులను గవర్నర్లు రాష్ట్రపతి ఆమోదించకుండా సంవత్సరాల తరబడి పెండింగ్లో పెట్టడం సరికాదని నిర్దిష్ట కాలపరిమితి 3 నెలలోపు ఆమోదించడమా తిరస్కరించడమా చేయాలని అలాగే బీహార్ రాష్ట్రంలో 65 లక్షల ఓట్లు గల్లంతు అయినా సందర్భంగా సుప్రీంకోర్టు జోక్యం చేసుకొని అందరికీ ఓటు హక్కు కల్పించాలని తీర్పునిచ్చిందని ఇలాంటి తీర్పులని సహించని సనాతనవాదులు దాడులకు దిగుతున్నారని విమర్శించారు ఈ దాడుల వెనుక ఎవరున్నారో ప్రజలకు సులభంగా అర్థం అవుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు నరసింహ నాగరాజు ఈశ్వరన్న వెంకటస్వామి శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -