Sunday, August 17, 2025
E-PAPER
spot_img
Homeమానవిడస్ట్‌ అలర్జీ బాధిస్తోందా?

డస్ట్‌ అలర్జీ బాధిస్తోందా?

- Advertisement -

ఒకసారి డస్ట్‌ ఎలర్జీ అటాక్‌ అయ్యిందంటే తగ్గడం కష్టమే. ఎన్నో రకాల మందులు వాడుతూ ఉంటారు. అయితే దీనిని కొన్ని రకాల నేచురల్‌ టిప్స్‌ ద్వారా దానికి చెక్‌ పెట్టొచ్చని నిపుణులు చెబుతున్నారు. ఇంతకీ ఆ నేచురల్‌ టిప్స్‌ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..
– డస్ట్‌ అలర్జీని చెక్‌ పెట్టడంలో రాక్‌సాల్ట్‌ బాగా ఉపయోగపడుతుంది. ఒక కప్పు వేడి నీటిలో రాక్‌ సాల్ట్‌ను కరిగించి ఆ నీటిని ఆవిరి పట్టాలి. ఇలా చేయడం వల్ల ముక్కు క్లీన్‌ అవుతుంది. గొంతు నొప్పి, వాపును తగ్గించడంలో సహాయపడుతుంది. దుమ్ము, బ్యాక్టీరియా నాశనం అవుతుంది.
– డస్ట్‌ అలర్జీ ఉన్న వారిలో అల్లం, తేనె కూడా బాగా ఉపయోగపడుతుంది. ఈ రెండింటిలో ఉండే నేచురల్‌ యాంటీ ఆక్సిడెంట్‌, యాంటీ ఇన్‌ఫ్లమేటరీ లక్షణాలు డస్ట్‌ అలర్జీని దూరం చేస్తుంది. ఒక చెంచా తేనెలో అల్లం రసం కలిపి ప్రతిరోజూ ఉదయం ఖాళీ కడుపుతో తీసుకుంటే డస్ట్‌ అలర్జీ దూరమవుతుంది. శరీరంలో రోగ నిరోధక శక్తి పెరుగుతుంది.
– శీతాకాలం, వర్షాకాలంలో డస్ట్‌ అలర్జీ మరింత ఎక్కువయ్యే అవకాశాలు ఉంటాయి. ముఖ్యంగా శ్వాసకోశ వ్యాధుల ప్రమాదాన్ని పెంచుతుంది. ఇలాంటి సమయంలో పసుపు, తులసి ఆకులు క్రీయాశీకలంగా ఉపయోగపడతాయి. తులసి ఆకులను ఉడకబెట్టి, అందులో పసుపు వేయాలి. అనంతరం నీరు సగం అయ్యే వరకు వేడి చెయ్యాలి. గోరు వెచ్చగా చేసుకొని ఈ నీటిని తాగాలి. ఇది శరీరంలోని విషాన్ని తొలగిస్తుంది.
– రాత్రి పడుకునే ముందే కొబ్బరి నూనె మసాజ్‌ చేసుకున్నా మంచి ఫలితం ఉంటుంది. ముక్కు, గొంతు దగ్గర కొబ్బరి నూనెను మసాజ్‌ చేయాలి. ఇది శ్వాస తీసుకోవడంలో తలెత్తే ఇబ్బందుల నుంచి ఉపశనం లభిస్తుంది.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad