Wednesday, July 16, 2025
E-PAPER
Homeమానవిస్టీల్ సింక్‌ వాడుతున్నారా?

స్టీల్ సింక్‌ వాడుతున్నారా?

- Advertisement -

ఇంట్లో వాడే స్టీల్‌ సింక్‌ ఎప్పుడూ కొత్తదానిలా తళతళలాడుతూ ఉండాలంటే ఏం చేయాలి? ఎలా శుభ్రం చేయాలి? గీతలు పడకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి.. చూద్దాం..
ముందుగా సింక్‌లో ఎలాంటి చెత్తా లేకుండా చూసుకోవాలి. ఇప్పుడు కొద్దిగా బేకింగ్‌ సోడా వేసి ఒక మెత్తటి స్పాంజ్‌ సాయంతో సింక్‌ అంతా వ్యాపించేలా బాగా రుద్ది, తర్వాత వెనిగర్‌తో కడగాలి. తర్వాత నీటితో శుభ్రం చేసి నిమ్మ లేదా నారింజ తొక్కలతో మెల్లగా సింక్‌ మొత్తం రుద్దాలి. ఇలా చేయడం వల్ల సింక్‌ నుంచి దుర్వాసన రాకుండా, తాజాగా ఉండడంతో పాటు ఎప్పటికీ కొత్తదానిలా మెరిసిపోతూ ఉంటుంది. మళ్లీ నీళ్లతో శుభ్రం చేసి, తడి పూర్తిగా ఆరిన తర్వాత మెత్తని వస్త్రంపై ఆలివ్‌నూనె వేసి సింక్‌ మొత్తం తుడవాలి.


ఈ జాగ్రత్తలు కూడా..
– లిక్విడ్‌ సోప్‌ లేదా ఇతర హౌస్‌హౌల్డ్‌ క్లీనర్స్‌ను స్టెయిన్‌లెస్‌ స్టీల్‌ సింకును శుభ్రం చేయడానికి ఉపయోగించకూడదు.
– సింక్‌లో బ్లీచ్‌, క్లోరిన్‌ వంటి పదార్థాలు కూడా ఎక్కువ సమయం ఉంచకూడదు. అలా ఉంచడం వల్ల మెరుపు తగ్గే అవకాశం లేకపోలేదు.
– స్టీల్‌ లేదా ఐరన్‌ స్క్రబ్స్‌ ఉపయోగించడం వల్ల గీతలు పడతాయి కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ వాటిని సింక్‌లో వాడకూడదు.
– ఉపయోగించిన ప్రతిసారీ నీళ్లు నిల్వ ఉండిపోకుండా చూసుకోవాలి. ఎప్పటికప్పుడు వేడినీళ్లలో మైల్డ్‌ సోప్‌ కలిపి వాటితో సింక్‌ని శుభ్రం చేయాలి.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -