Friday, August 22, 2025
E-PAPER
spot_img
Homeసినిమాకబడ్డీ బ్యాక్‌డ్రాప్‌లో'అర్జున్‌ చక్రవర్తి'

కబడ్డీ బ్యాక్‌డ్రాప్‌లో’అర్జున్‌ చక్రవర్తి’

- Advertisement -

విజయ రామరాజు టైటిల్‌ రోల్‌ పోషించిన స్పోర్ట్స్‌ డ్రామా చిత్రం ‘అర్జున్‌ చక్రవర్తి’. విక్రాంత్‌ రుద్ర దర్శకత్వం వహించిన ఈ సినిమాని నిర్మాత శ్రీని గుబ్బల నిర్మించారు. ఇప్పటికే ఈ సినిమాకు 46 ఇంటర్నేషనల్‌ ఫిల్మ్‌ అవార్డ్స్‌ వచ్చాయి. ఈ చిత్రం ఈనెల 29న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో మేకర్స్‌ ట్రైలర్‌ను లాంచ్‌ చేశారు. డైరెక్టర్‌ విక్రాంత్‌ రుద్ర మాట్లాడుతూ,”అర్జున్‌ చక్రవర్తి’ కేవలం సినిమా మాత్రమే కాదు. నా తొమ్మిది సంవత్సరాల కల. మా టీమ్‌ అంతా ఆరేళ్లపాటు హార్డ్‌ వర్క్‌ చేశారు. మా నిర్మాతగా ఇచ్చిన సపోర్ట్‌ని మర్చిపోలేను. హీరో విజరు ఈ సినిమా కోసం ప్రాణం పెట్టి పనిచేసాడు. చాలా రిస్కులు తీసుకున్నాడు. డిఓపి జగదీష్‌ అద్భుతమైన విజువల్స్‌ అందించారు. సిజ దేవిక పాత్రలో ఒదిగిపోయింది. ఈ సినిమా తప్పకుండా అందరికీ నచ్చుతుందని నమ్మకం ఉంది’ అని తెలిపారు.

‘ఇప్పుడు వరకు మేము రిలీజ్‌ చేసిన ప్రమోషనల్‌ కంటెంట్‌కి చాలా మంచి రెస్పాన్స్‌ వచ్చింది. విజువల్స్‌ చూస్తుంటే చాలా బిగ్‌ మూవీలా కనిపిస్తుందని ఆడియన్స్‌ చెప్తున్నారు. ప్రతి ఒక్కరు అదిరిపోయిందని చెప్పారు. మా డైరెక్టర్‌ సినిమాను నెక్స్ట్‌ లెవెల్‌లో తీశారు. సినిమాకి కూడా చాలా మంచి సక్సెస్‌ వస్తుందని ఆశిస్తున్నాం’ అని హీరో విజయరామరాజు చెప్పారు. హీరోయిన్‌ సిజ రోజ్‌ మాట్లాడుతూ, ‘మాకు ఇది చాలా ఎమోషనల్‌ మూమెంట్‌. ఈ సినిమాలో భాగం కావడం చాలా ఆనందంగా ఉంది. ఇది నా ఫస్ట్‌ తెలుగు మూవీ’ అని తెలిపారు.’ఈనెల 29న ప్రో కబడ్డీ స్టార్ట్‌ అవుతుంది. అలాగే 29న నేషనల్‌ స్పోర్ట్స్‌ డే. కబడ్డీ బ్యాక్‌డ్రాప్‌లో వస్తున్న మా చిత్రం కూడా ఈనెల 29న రిలీజ్‌ అవుతుంది. సినిమా చాలా అద్భుతంగా వచ్చింది. కచ్చితంగా ఆడియన్స్‌కి ఒక డిఫరెంట్‌ ఎక్స్‌పీరియన్స్‌ ఇస్తుంది’ అని నిర్మాత శ్రీని గుబ్బల చెప్పారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad