Saturday, September 6, 2025
E-PAPER
spot_img
Homeసినిమా'అర్జున్‌ చక్రవర్తి' సినిమాటోగ్రఫీకి 4 అంతర్జాతీయ అవార్డులు

‘అర్జున్‌ చక్రవర్తి’ సినిమాటోగ్రఫీకి 4 అంతర్జాతీయ అవార్డులు

- Advertisement -

”అర్జున చక్రవర్తి’కి సంబం ధించి అంతర్జాతీయ స్థాయిలో నాకు నాలుగు అవార్డులు వచ్చాయి. కోలీవుడ్‌ ఇంటర్నేషనల్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌ ఇండియా, కేరవ్యాన్‌ ఇంటర్నేషనల్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌, మోకో ఇంటర్నేషనల్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌, ది బుద్దా ఇంటర్నేషనల్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌ అవార్డులు రావడం ఆనందంగా ఉంది. అలాగే ఇటీవల విడుదలైన మా చిత్రానికి, ముఖ్యంగా విజువల్స్‌ చాలా బాగా ఉన్నాయంటూ అందరూ ప్రశంసించడం మరింత సంతోషంగా ఉంది’ అని సినిమాటోగ్రాఫర్‌ జగదీష్‌ చీకటి అన్నారు. కబడ్డీ నేపథ్యంలో రూపొంది ప్రేక్షకుల ముందుకొచ్చిన చిత్రం ‘అర్జున్‌ చక్రవర్తి’. ఈ చిత్రానికి విశేష ప్రేక్షకాదరణ లభిస్తున్న నేపథ్యంలో సినిమాటో గ్రాఫర్‌ జగదీష్‌ చీకటి మీడియాతో తన ఆనందాన్ని షేర్‌ చేసుకున్నారు. జేఎన్టీయూ ఫైన్‌ ఆర్ట్స్‌ కాలేజీలో చదువుతున్న రోజుల్లోనే ఫొటోగ్రఫీలో ఎన్నో అవార్డులు సాధించాను. ఫోటోగ్రఫీలోనూ మాస్టర్స్‌ చేశాను. దూరదర్శన్‌లో పని చేశాను. వందకు పైగా షార్ట్‌ ఫిల్మ్స్‌, డాక్యుమెంటరీ ఫిల్మ్స్‌, ఎన్నో కమర్షియల్‌ యాడ్స్‌, మరెన్నో ప్రాజెక్టులు చేశాను. అలా చేస్తున్న సమయంలోనే ‘జత కలిసే’ మూవీకి అవకాశం వచ్చింది. కొత్త వాళ్లందరం కలిసి ఆ మూవీని చేశాం. ఆ సమయంలోనే ‘నాయకి’, ఆర్జీవీ ప్రొడక్షన్స్‌ నుంచి ‘భైరవ గీత’ ఇలా చాలా ప్రాజెక్ట్‌లు వచ్చాయి. దూరదర్శన్‌లో చేస్తున్న ప్రభుత్వ ఉద్యోగాన్ని మానేసి సినిమాటోగ్రాఫర్‌గా సినిమాల్లోకి వెళ్తానంటే మా నాన్న ఎంతో సపోర్ట్‌ చేశారు. ‘భైరవ గీత’ మూవీని చూసిన దర్శకుడు విక్రాంత్‌ రుద్ర ఈ మూవీకి నన్ను సంప్రదించారు. వరల్డ్‌ క్లాస్‌ స్టాండర్డ్స్‌తో ఈ చిత్రాన్ని తెరకెక్కించాలని రకరకాల వేరియేషన్స్‌తో మూవీని తీశాం. పాత్ర తీరు, ప్రయాణానికి తగ్గట్టుగా కలర్‌ వేరియేషన్స్‌ చూపించాను. మూడు రకాల కెమెరాలతో షూట్‌ చేశాం. విజన్‌ డిఫరెన్స్‌ ఉండాలని రకరకాల లెన్స్‌లను వాడాం. ఎన్నో సవాళ్ళు ఎదురైనప్పటికీ హాలీవుడ్‌ స్థాయికి దీటుగా తీశాం. హీరో విజరు రామరాజుకి సినిమా పట్ల చాలా ప్యాషన్‌, డెడికేషన్‌ ఉంది. ఇందులో చాలా వేరియేషన్స్‌ చూపించాడు. నిర్మాత శ్రీని గుబ్బల ఈ కథని బాగా నమ్మారు. అందుకే ఎక్కడా రాజీపడకుండా నిర్మించారు. దర్శకుడు విక్రాంత్‌ అద్భుతంగా తీశాడు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad