Sunday, July 20, 2025
E-PAPER
Homeఆటలుసెమీస్‌లో అర్జున్‌

సెమీస్‌లో అర్జున్‌

- Advertisement -

క్వార్టర్స్‌లో ప్రజ్ఞానంద ఓటమి
ఫ్రీస్టయిల్‌ చెస్‌ గ్రాండ్‌స్లామ్‌
లాస్‌వెగాస్‌ (యుఎస్‌ఏ) :
భారత గ్రాండ్‌మాస్టర్‌, తెలంగాణ తేజం అర్జున్‌ ఎరిగేశి లాస్‌వెగాస్‌ ఫ్రీస్టయిల్‌ చెస్‌ గ్రాండ్‌స్లామ్‌లో సెమీఫైనల్‌కు చేరుకున్నాడు. ఉబ్బెకిస్థాన్‌ గ్రాండ్‌మాస్టర్‌ నొడిర్బెక్‌పై అలవోక విజయం సాధించిన అర్జున్‌.. సునాయాసంగా సెమీస్‌లో ప్రవేశించాడు. అర్జున్‌ తొలి గేమ్‌ను డ్రా చేసుకున్నా.. తెల్ల పావులతో రెండో గేమ్‌లో మెరుపు విజయం నమోదు చేశాడు. నేడు సెమీఫైనల్లో లెవాన్‌ అరోనియన్‌ (అమెరికా)తో అర్జున్‌ పోటీపడనున్నాడు. హికారు నకమురపై లెవాన్‌ క్వార్టర్స్‌లో సాధికారిక విజయం సాధించాడు. మరో క్వార్టర్‌ఫైనల్లో భారత యువ గ్రాండ్‌మాస్టర్‌ ఆర్‌. ప్రజ్ఞానంద పోరాడి ఓడాడు. అమెరికా జీఎం ఫాబియానో కారువానా, ప్రజ్ఞానందలు క్లాసికల్‌, ర్యాపిడ్‌, బ్లిట్జ్‌ ఫార్మాట్లలో చెరో విజయం సాధించారు. దీంతో విజేతను ఆర్మగెడ్డన్‌ గేమ్‌లో తేల్చాల్సి వచ్చింది. యుఎస్‌ఏ జీఎం తెల్ల పావులతో ప్రజ్ఞానంద ఎత్తులను చిత్తు చేశాడు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -