ఆంతననరివో : సైనిక తిరుగుబాటుతో అధికారాన్ని చేజిక్కించుకున్న ఆర్మీ కల్నల్ మైఖేల్ రాండ్రియానిరినా మడగాస్కర్ కొత్త ప్రధానిగా ప్రమాణస్వీకారం చేయననున్నారు. మడగాస్కర్ రాజ్యాంగన్యాయస్థానం శుక్రవారం ఒక వేడుకలో కల్నల్ మైఖేల్ రాండ్రియానిరినా నియామకాన్ని అధికారికంగా ఆమోదించింది. దేశ ఉన్నత రాజ్యాంగన్యాయస్థానంలో ప్రమాణస్వీకారం చేస్తారని రాష్ట్రమీడియా ఒక ప్రకటనలో తెలిపింది. విద్యుత్, నీటి కొరతపై యువత చేపట్టిన నిరసనలు హింసాత్మకంగా మారాయి. ఈ ఘర్షణల్లో 22మంది మరణించగా, సుమారు 100మందికి పైగా గాయపడ్డారని ఐక్యరాజ్యసమితి నివేదించింది. ప్రజా తిరుగుబాటుతో సైన్యం అధికారాన్ని స్వాధీనం చేసుకోవడంతో మాజీ అధ్యక్షుడు ఆండ్రీ రాజోలినా దేశం నుండి పారిపోయిన సంగతి తెలిసిందే. విధులను విడిచిపెట్టడంతో రాజోలీనాను అభిశంసించిన గందరగోళ పరిస్థితుల్లో .. మూడు రోజులకే సైన్యాధికారి అధ్యక్ష పదవి చేపట్టడం గమనార్హం. మూడువారాల యువత ప్రభుత్వ వ్యతిరేక నిరసనల తర్వాత దేశాన్ని సైన్యం స్వాధీనం చేసుకోవడాన్ని ఐక్యరాజ్యసమితి ఖండించింది. మడగాస్కర్‌ను ఆఫ్రికన్ యూనియన్ నుండి సస్పెండ్ చేస్తున్నట్లు ప్రకటించింది. సైనికులతో తన ప్రాణాలకు ప్రమాదం ఉందంటూ దేశాన్ని విడిచిపెట్టిన అధ్యక్షుడు ఆండ్రీ రాజోలినా ప్రస్తుతం ఎక్కడ ఉన్నదీ వివరాలు తెలియదు.
మడగాస్కర్ అధ్యక్షుడిగా ఆర్మీ కల్నల్ మైఖేల్ రాండ్రియానిరినా ప్రమాణస్వీకారం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES