Thursday, October 16, 2025
E-PAPER
Homeఖమ్మంపామాయిల్ విత్తనాలు నాటేందుకు ఏర్పాట్లు

పామాయిల్ విత్తనాలు నాటేందుకు ఏర్పాట్లు

- Advertisement -

– హాజరు కానున్న మంత్రి తుమ్మల, చైర్మన్ జాంగా,ఎమ్మెల్యే జారె లు
– ఓఎస్డీ కిరణ్ కుమార్
నవతెలంగాణ – అశ్వారావుపేట

రెండేళ్ళు విరామం అనంతరం ఆయిల్ ఫేడ్ కేంద్రీయ నర్సరీలో పామాయిల్ మొక్కలు పెంచేందుకు సన్నహాలు చేస్తున్నారు. ఇప్పటికే విత్తనాలు నాటేందుకు మట్టిని సిద్దం చేసి పాలీ హౌస్ లు పునరుద్ధరించి,ప్లాస్టిక్ సంచుల్లో మట్టి నింపే పనులను ఆయిల్ఫెడ్ డీఓ నాయుడు రాధా క్రిష్ణ పర్యవేక్షిస్తున్నారు. శుక్రవారం ఈ విత్తనాలు నాటే శుభకార్యానికి తెలంగాణ వ్యవసాయ శాఖా మంత్రి తుమ్మల నాగేశ్వరరావు,ఎమ్మెల్యే జారె ఆదినారాయణ, ఆయిల్ ఫెడ్ చైర్మన్ జంగా రాఘవరెడ్డి,ఎండీ శంకరయ్య లు హాజరు కానున్నట్లు ఓఎస్డీ అడపా కిరణ్ కుమార్ గురువారం నవతెలంగాణ కు వెళ్ళడి చేసారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ .. రైతులు కోరిన విధంగా ఈ సారి థాయ్లాండ్,ఇండోనేసియా ల నుండి సిరాడ్ కంపెనీ రూపొందించిన పొట్టి రకం జాతికి చెందిన పామాయిల్ విత్తనాలు నాటి రైతులకు నాణ్యమైన మొక్కలు పంపిణీ చేస్తామని అన్నారు. ఈ రకం విత్తనం గేనోడెర్మా వ్యాధిని సైతం తట్టుకునే విధంగా రూపొందించారని అన్నారు. అశ్వారావుపేట నర్సరీలో 4 నుండి 5 లక్షలు విత్తనాలు నాటి నర్సరీ నిర్వహిస్తామని ఆయన తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -