Tuesday, March 24, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంరాజీ కేసుల పరిష్కారానికి ఏర్పాట్లు

రాజీ కేసుల పరిష్కారానికి ఏర్పాట్లు

- Advertisement -

28న జాతీయ లోక్‌ అదాలత్‌ : హైకోర్టు న్యాయమూర్తి
పి.శ్యామ్‌ కోషికి వివరించిన డీజీపీ
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌

ఈ నెల 28న నిర్వహించనున్న జాతీయ లోక్‌ అదాలత్‌ సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా గరిష్ఠ సంఖ్యలో రాజీపడదగ్గ కే0సులను పరిష్కరించేందుకు పోలీసు శాఖ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసిందని డైరెక్టర్‌ జనరల్‌ ఆఫ్‌ పోలీస్‌ బి. శివధర్‌ రెడ్డి, హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ పి.శ్యామ్‌ కోషికి వివరించారు. వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా సోమవారం డీజీపీ హైకోర్టు న్యాయమూర్తికి పోలీస్‌ శాఖ తీసుకుంటున్న చర్యలను వివరించారు. తొలుత మార్చి 14న జరగాల్సిన ఈ అదాలత్‌ 28వ తేదీకి రీషెడ్యూల్‌ అయిన నేపథ్యంలో క్షేత్రస్థాయిలో చేస్తున్న ఏర్పాట్లను తెలియజేశారు. అదాలత్‌కు 10 రోజుల ముందు నుంచే, అంటే మార్చి 19 నుంచి 27 వరకు ప్రతి రోజూ ‘డైలీ సిట్యుయేషన్‌ రిపోర్ట్‌ ద్వారా స్టేట్‌ క్రైమ్‌ రికార్డ్స్‌ బ్యూరో, సీఐడీ విభాగాలు కేసుల పురోగతిని పర్యవేక్షిస్తున్నాయని తెలిపారు. ఈ నివేదికలో గుర్తించిన రాజీపడదగ్గ కేసులు, జారీ చేసిన నోటీసులు, ప్రీ-లోక్‌ అదాలత్‌ ద్వారా పరిష్కారమైన కేసుల వివరాలను ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నట్టు పేర్కొన్నారు. గతేడాది మార్చి 8న 1,83,182 కేసులు, జూన్‌ 14న 1,93,439 కేసులు, నవంబర్‌ 15న, డిసెంబర్‌ 21న 1,79, 964 కేసులు (స్పెషల్‌ లోక్‌ అదాలత్‌ కలిపి) పరిష్కారమయ్యాయనీ, ఈసారి ఆ సంఖ్యను మరింత పెంచేలా ప్రణాళికలు రూపొందించామని వివరించారు. ముఖ్యంగా పాత ట్రాఫిక్‌ చలాన్లు భారీ సంఖ్యలో పెండింగ్‌లో ఉన్నందున వాటి పరిష్కారంపై ప్రత్యేక దష్టి సారించామనీ, రాజీపడదగ్గ కేసులను ముందుగానే గుర్తించి కక్షిదారులకు అవగాహన కల్పిస్తున్నామని డీజీపీ తెలిపారు. ప్రతి పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి, ప్రాసిక్యూషన్‌ అధికారుల సమన్వయంతో కేసుల పరిష్కారానికి కృషి చేస్తున్నామన్నారు. వీడియో కాన్ఫరెన్స్‌లో డైరెక్టర్‌, సైబర్‌ సెక్యూరిటీ బ్యూరో శిఖా గోయల్‌, శాంతి భద్రతల అడిషనల్‌ డీజీపీ మహేష్‌ ఎం.భగవత్‌, అడిషనల్‌ డీజీపీ సీఐడీ చారు సిన్హా, ఫ్యూచర్‌ సిటీ కమిషనర్‌ సుధీర్‌ బాబు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -