నవతెలంగాణ – వనపర్తి
ప్రభుత్వం ఇటీవల కాలంలో నిర్వహించిన గ్రామ పాలన ఆఫీసర్స్ ఎగ్జామ్స్ లో ఉత్తీర్ణులైన లబ్ధిదారులకు సెప్టెంబర్ 5న నియామక పత్రాలను హైదరాబాద్ లో రాష్ట్ర ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి చేతుల మీదగా అందజేసేందుకు జిల్లాలో ఉత్తీర్ణత సాధించిన లబ్ధిదారుల నియమక పత్రాలు ఇచ్చేందుకు సన్నహక ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి కి ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్లో సిసిఎల్ ఉన్నతాధికారి లోకేష్ కుమార్ వనపర్తి జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభిని గ్రామ పాలన ఆఫీసర్స్ ఉత్తర్వుల నివేదిక పై వివరాలు అడిగి తెలుసుకున్నారు.
ఇప్పటి వరకు జిల్లాలో 15 మండల పరిధిలో ఉన్న 228 గ్రామ పంచాయతీల్లో 133 క్లస్టర్ ఉండగా అందులో 135 మంది ఎగ్జామ్స్ రాశారని తెలిపారు. 109 మంది అభ్యర్థుల అర్హుల జాబితాను అధికారులు తయారు చేశారు. ప్రస్తుతం గ్రామ పంచాయతీ పాలన ఆఫీసర్స్ లుగా 81 మంది కి నియామక పత్రాలను ఇచ్చేందుకు ఏర్పాట్లు చేశారు. అర్హులైన లబ్ధిదారులను హైదరాబాదుకు తీసుకెళ్ళేందుకు పూర్తి ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి అధికారులను ఆదేశించారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ రెవెన్యూ ఎన్. ఖీమ్యా నాయక్, కలెక్టరేట్ పరిపాలనాధికారి భాను ప్రకాష్, ఆర్డీవో సుబ్రహ్మణ్యం, పలువురు పాల్గొన్నారు.