అమరావతి: బీహార్‌కి చెందిన ఐపీఎస్ అధికారి సునీల్ నాయక్‌పై గుంటూరు మొబైల్ గురువారం అరెస్ట్ వారెంట్ జారీ చేసింది. ఏపీ శాసనసభ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజును వై.ఎస్.జగన్ ప్రభుత్వ హయాంలో సీఐడీ కస్టడీలో చిత్రహింసలకు గురిచేసి, హత్యా యత్నానికి పాల్పడ్డారంటూ కేసు నమోదైన సంగతి తెలిసిందే. ఈ కేసు విచారణ కోసం గుంటూరు పోలీసులు ఇచ్చిన నోటీసులపై సునీల్ నాయక్ స్పందించడం లేద. దీంతో ఆయనను అరెస్టు చేసేందుకు ఇటీవల ఎస్పీ దామోదర్ బృందం పాట్నాకు వెళ్లింది. అయితే ట్రాన్సిట్ వారెంట్ జారీ చేసేందుకు అక్కడి హైకోర్టు నిరాకరించింది. పోలీసులు సునీల్ నాయక్‌కు అరెస్ట్ వారెంట్ జారీ చేయాలని గుంటూరు మొబైల్ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీంతో నేడు గుంటూరు మొబైల్ కోర్టు అరెస్ట్ వారెంట్ జారీ చేసింది.



