Friday, February 20, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్కళాకారులకు దేవస్థానం ఉద్యోగాలలో అవకాశం కల్పించాలి  

కళాకారులకు దేవస్థానం ఉద్యోగాలలో అవకాశం కల్పించాలి  

- Advertisement -

నవతెలంగాణ – ఆలేరు టౌన్ 
తెలంగాణ ప్రజానాట్యమండలి కళాకారులకు, యాదగిరిగుట్ట దేవస్థానంలో ఉద్యోగ అవకాశాలు కల్పించాలని, తెలంగాణ ప్రజానాట్యమండలి యాదాద్రి భువన జిల్లా ప్రధాన కార్యదర్శి చెక్క వెంకటేష్  అన్నారు. ఆలేరు పట్టణంలో శుక్రవారం ఆ సంఘం సభ్యుల  సమావేశం కిష్టమ్మ అధ్యక్షతన నిర్వహించారు. యాదగిరిగుట్టలో బ్రహ్మోత్సవాలు జరుగుతున్న సందర్భంగా, కళాకారులకు అవకాశం కల్పించాలని, అనేకసార్ల గుట్ట ఈవోకు వినతి పత్రం అందజేయడం జరిగిందని గుర్తు చేశారు.

జిల్లాలోని కళాకారులకు, కోలాట బృందాలకు, భజన బృందాలకు,భాగోత కళాకారులకు, సింధు కళాకారులకు, జానపద కళాకారులకు, డప్పు కళాకారులకు అవకాశం కల్పించాలని ప్రభుత్వాన్ని, ఎమ్మెల్యే,ప్రభుత్వ విప్పు, బిర్ల ఐలయ్య, కలెక్టర్ హనుమంతురావులను కోరుతున్నామని చెప్పారు. ఈ కార్యక్రమంలో సరిత, పద్మ,సుశీల,అంజమ్మ, జయమ్మ,అండాలు,నర్మదా తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -