Monday, November 10, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ప్రజాకవి అందెశ్రీకి అరుణోదయ, ప్రజా సంఘాల జోహార్లు

ప్రజాకవి అందెశ్రీకి అరుణోదయ, ప్రజా సంఘాల జోహార్లు

- Advertisement -

నవతెలంగాణ – ఆర్మూర్
ప్రజాకవి తెలంగాణ జాతీయ గీతం రచయిత అందెశ్రీ ఈరోజు మరణించడం విషాదకరణంఅని, పట్టణంలో అరుణోదయ, ఐ ఎఫ్ టి యు, పిడిఎస్యు, పి వై ఎల్, పి ఓ డబ్ల్యు, ఏఐకేఎంఎస్ ప్రజా సంఘాల ఆధ్వర్యంలో అందెశ్రీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.

ఈ సందర్భంగా అరుణోదయ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దాసు, జిల్లా అధ్యక్ష కార్యదర్శులు వి సురేష్ బాబు, అబ్దుల్, మాట్లాడుతూ.. అందెశ్రీ మరణం ప్రజా సాహిత్య సంస్కృతిక ఉద్యమానికి తీవ్ర నష్టమని వారు తెలిపారు. నిజాంబాద్ జిల్లాలో మన ఆర్మూర్ ప్రాంతంకు మేస్త్రి పని చేయడానికి వచ్చిన అందె ఎల్లయ్య, పాటలపై, సాహిత్యం పై మమకారంతో స్వకృషితో అనేక రచనలు చేసి అందెశ్రీగా పరిణామం చెందారని వారు తెలిపారు. అందెశ్రీ సామాజిక స్పృహ, ప్రత్యేక తెలంగాణ ఉద్యమ ప్రేరణకు అనే కవితలు పాటలు రాశారని వారు అన్నారు. పుట్టుక మరణం సహజమేనని ప్రజల కోసం రచనలు చేయడం ఉన్నతమైనదని వారు అందెశ్రీ సాహిత్యాన్ని కొనియాడారు.

పశువుల కాపరి ప్రజాకవిగా పరిణామం చెంది, అనేక అవార్డులు అందుకున్నారని వారు తెలిపారు. సినిమా పాటలు రాసి మన్నన పొందాడని, 2024లో వేగుచుక్క సినిమాలో కొలిచి చెక్కితే బొమ్మరా పాట, 2006 సంవత్సరంలో గంగా సినిమాలో వెళ్లి పోయినావా తల్లి పాట, 2008 నారాయణమూర్తి సినిమా ఎర్ర సముద్రంలో మాయమైపోతున్నాడమ్మా మనిషన్నవాడు పాటలకు అవార్డులు అందుకున్నారని వారు తెలిపారు. మాయమైపోతున్నాడమ్మ పాట తెలుగు యూనివర్సిటీ డిగ్రీ ద్వితీయ సంవత్సరంలో పాఠ్యాంశంగా చేర్చారని, విలువైన సందేశాన్నిచ్చే, సామాజిక స్పృహను కలిగించే రచనలు చేయడంలో అందెశ్రీ ఆరితేరారని వారన్నారు. 

కాకతీయ యూనివర్సిటీ గౌరవ డాక్టరేట్, దాశరథి సాహితి పురస్కారం, సుద్దాల హనుమంతు జాతీయ పురస్కారం అందే శ్రీ అందుకున్నారని వారు తెలిపారు. అన్నిటికంటే ప్రజల కష్టాలను, పాటలుగా మనిషి, శ్రమ దోపిడీ నుండి విముక్తి కోసం అనేక గేయాలు రాసిన అందర్ శ్రీ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయాడని వారు కొనియాడారు. ఈ కార్యక్రమంలో ఐఎఫ్టియు జిల్లా ఉపాధ్యక్షులు శివాజీ, ఎల్ఐసి ఆర్మూర్ డివిజన్ కార్యదర్శి వి.బాలయ్య, ఏఐకేఎంఎస్ నాయకులు దేవన్న ,మార్క్స్, పి ఓ డబ్ల్యు చిట్టక్క, ఎం లక్ష్మి, పి డి ఎస్ యు ప్రిన్స్, రాహుల్, రాజేశ్వర్ కళాకారులు నారాయణ, రంజిత్, సంజీవ్ తదితరులు పాల్గొన్నారు. 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -