హీరో తేజ సజ్జా తాజాగా నటిస్తున్న పాన్ ఇండియా చిత్రం ‘మిరాయ్’. ఇందులో సూపర్ యోధ పాత్రలో ఆయన అలరించబోతున్నారు. కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై టీజీ విశ్వ ప్రసాద్, కృతి ప్రసాద్ నిర్మించారు. ఈ చిత్రంలో శ్రియ శరణ్ కీలక పాత్ర పోషిస్తున్నారు. మేకర్స్ తాజాగా ఆమె పోషించిన అంబిక పాత్రను పరిచయం చేస్తూ ఒక ప్రత్యేక పోస్టర్‌ను రిలీజ్ చేశారు. ఇందులో ఆమె పవర్‌ఫుల్ మదర్ క్యారెక్టర్‌లో నటిస్తున్నారు. ఈ ఎపిక్ సైన్స్ ఫిక్షన్ యాక్షన్ అడ్వెంచర్‌లో ఆమె పాత్ర చాలా స్ట్రాంగ్ ఎమోషన్‌తో ఉండబోతుంది. ఈ పోస్టర్ సూపర్ హీరో ప్రయాణం వెనుక ఉన్న ఎమోషన్‌ని హైలైట్ చేస్తుంది.
ఈ చిత్రంలో తేజ సజ్జ సరసన రితికా నాయక్ కథానాయికగా నటిస్తుండగా, జయరామ్, జగపతిబాబు కీలక పాత్రల్లో కనిపించనున్నారు అని చిత్ర యూనిట్ తెలిపింది. ఈనెల 12న వరల్డ్ వైడ్ ఈ సినిమా రిలీజ్ కానుంది. ఈ చిత్రానికి దర్శకత్వం: కార్తీక్ ఘట్టమనేని, నిర్మాతలు: టిజి విశ్వ ప్రసాద్, కతి ప్రసాద్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: సుజిత్ కుమార్ కొల్లి, సంగీతం: గౌర హరి.
అగ్ర కథానాయకుడు రజనీకాంత్ ‘మిరారు’ చిత్ర ట్రైలర్‌ను వీక్షించి, చాలా బాగుం దంటూ చిత్ర బృందాన్ని అభినందించారు. గ్రాండ్ స్కేల్‌లో మూవీ మేకింగ్‌తోపాటు మనోజ్ క్యారెక్టర్ పవర్‌ఫుల్‌గా ఉందన్నారు. ఈ చిత్ర ట్రైలర్‌తో రజనీకాంత్ బ్లెస్సింగ్స్ తనకు దక్కడం పట్ల మనోజ్ సంతోషాన్నివ్యకం చేశారు.