Saturday, February 7, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంఆశా వర్కర్లకు ఫిక్స్డ్‌ వేతనం రూ.18 వేలివ్వాలి

ఆశా వర్కర్లకు ఫిక్స్డ్‌ వేతనం రూ.18 వేలివ్వాలి

- Advertisement -

పీఎఫ్‌, ఈఎస్‌ఐ, ఉద్యోగభద్రత, తదితర సమస్యలను పరిష్కరించాలి : ప్రజావాణిలో తెలంగాణ ఆశా వర్కర్స్‌ యూనియన్‌(సీఐటీయూ) వినతి
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌

ఆశావర్కర్లకు ఫిక్స్డ్‌ వేతనం రూ.18 వేలు ఇవ్వాలనీ, పీఎఫ్‌, ఈఎస్‌ఐ, ఉద్యోగ భద్రత, పెండింగ్‌ బిల్లుల సమస్యలను పరిష్కరించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని తెలంగాణ ఆశా వర్కర్స్‌ యూనియన్‌(సీఐటీయూ అనుబంధం) రాష్ట్ర అధ్యక్షులు పి.జయలక్ష్మి డిమాండ్‌ చేశారు. ఈ మేరకు శుక్రవారం హైదరాబాద్‌లో ప్రజావాణి కార్యక్రమంలో నోడల్‌ అధికారి దివ్యదేవరాజన్‌కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆశావర్కర్ల సమస్యలను ఆమె దృష్టికి తీసుకెళ్లారు. యూనియన్‌ నేతలు గంట పాటు వివరించిన అన్ని అంశాలను ఆమె సావదానంగా విన్నారు. ఆశా వర్కర్స్‌ యూనియన్‌ నేతలు లేవనెత్తిన పలు అంశాలను రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించేలా కృషి చేస్తామని దివ్యదేవరాజన్‌ భరోసానిచ్చారు. ప్రసూతి సెలవులు ఇచ్చే విధంగా, 2018 నుండి మరణించిన ఆశా వర్కర్ల వివరాలు తెలియజేస్తే వారికి 20 వేలు మట్టి ఖర్చులు ఇస్తామని హామీనిచ్చారు. రూ.10 లక్షల హెల్త్‌ ఇన్సూరెన్స్‌ ఆశా వర్కర్లకు కూడా వర్తిస్తుందనీ, దీనిపైన అవగాహన కల్పిస్తామని చెప్పారు. మిగిలిన అన్ని సమస్యల పైన ప్రభుత్వంతో చర్చిస్తామనీ, పరిష్కరించే విధంగా కషి చేస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఆ యూనియన్‌ రాష్ట్ర కోశాధికారి పి.గంగమణి, రాష్ట్ర ఉపాధ్యక్షులు టి.యాదమ్మ, రాష్ట్ర సహాయ కార్యదర్శి ఎం.రేవతి, కల్యాణి, సీఐటీయూ హైదరాబాద్‌ సౌత్‌ జిల్లా అధ్యక్షులు ఎం.మీనా, ఆశా నాయకులు విజయ కుమారి, ఉజ్వల, అనూష,తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -