Sunday, February 1, 2026
E-PAPER
Homeఖమ్మంఅశ్వారావుపేట అంటే ఆత్మీయత, ఆప్యాయతలకు నిలయం

అశ్వారావుపేట అంటే ఆత్మీయత, ఆప్యాయతలకు నిలయం

- Advertisement -

– క్రీడలతో మానసిక ఉల్లాసం 
– పీజేటీజీఏయూ రిజిస్ట్రార్ డాక్టర్ విద్యాసాగర్ 
నవతెలంగాణ – అశ్వారావుపేట 

వ్యవసాయ విశ్వవిద్యాలయం, కళాశాల వేడుక ఏదైనా,ఎప్పుడు అయినా అశ్వారావుపేట కళాశాల యాజమాన్యం ఇచ్చే ఆతిధ్యం ఎప్పటికీ గుర్తుండిపోయే లా,ఎంతో సంతృప్తిని కలిగిస్తుందని ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం రిజిస్ట్రార్ డాక్టర్ జీ.ఈశ్వర చంద్ర విద్యాసాగర్ కొనియాడారు. స్థానిక వ్యవసాయ కళాశాల లో గత మూడు రోజులపాటు జరిగిన ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం బోధనేతర సిబ్బంది క్రీడా,ఆటల, సాహిత్య,సాంస్కృతిక పోటీలు ఆదివారం తో ముగిసాయి. 

ఈ ముగింపు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ పోటీల ద్వారా ఉద్యోగుల్లో దాగి ఉన్న క్రీడా ప్రతిభ, సృజనాత్మకత,సాంస్కృతిక నైపుణ్యాలను వెలికి తీయడం లక్ష్యంగా పెట్టుకున్నామని, అందరు కూడా అదే స్ఫూర్తితో పాల్గొని విశ్వవిద్యాలయం ఐక్యతను క్రీడా స్పూర్తి ని చాటేలా వ్యవహరించారని అన్నారు. 

ప్రతి వ్యక్తికి కూడా సంపద,విద్య, ఉద్యోగం,పిల్లలు,ఆస్తులు తో పాటు ఆరోగ్యం చాలా అవసరం అని,ఆరోగ్యమే మహా భాగ్యమని, ఈ వసతులు కల్పించడానికి మన విశ్వవిద్యాలయం సర్వం కృషి చేస్తుందని అన్నారు. అనంతరం మూడు రోజుల పాటు జరిగిన పోటీలలో వివిధ జోన్ల విజేతలు రన్నర్ లకు బహుమతుల పంపిణీ చేసారు.

స్థానిక కళాశాల అసోసియేట్ డీన్ డాక్టర్ జే.హేమంత కుమార్,డాక్టర్ ఎం.రామ్ ప్రసాద్ సమన్వయంలో జరిగిన ఈ ముగింపు కార్యక్రమంలో జాయింట్ రిజిస్ట్రార్ డి.శివాజి,ఈ క్రీడల యూనివర్సిటీ అబ్జర్వర్ గా డాక్టర్ కే.చరిత్ కుమార్ వ్యవహరించారు.  ఈ కార్యక్రమం లో బోధనేతర అసోసియేషన్ అధ్యక్షులు ఎం.శ్రీనివాస యాదవ్, సిబ్బంది పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -