నవతెలంగాణ – జన్నారం
ఆసిఫాబాద్ కొమురంభీం జిల్లా కేంద్రంలో నిర్వహించిన ప్రభుత్వ కార్యక్రమంలో ఎమ్మెల్యే కోవా లక్ష్మీ ఆసిఫాబాద్ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ అజ్మీర శ్యాం నాయక్ పై చేసిన దాడిని ఆల్ ఇండియా బంజారా సేవా సంఘం జన్నారం మండల శాఖ ఆధ్వర్యంలోో ఖండిస్తున్నామని ఆ సంఘం జన్నారం అధ్యక్షులు అజ్మీరా బీమ్లాల్ నాయక్ అన్నారు. శనివారం మండల కేంద్రంలో పత్రికా విలేకరులతో మాట్లాడారు.
ఎమ్మెల్యే కోవా లక్ష్మి వెంటనే క్షమాపణ కోరాలన్నారు.బంజారా సమాజంతోనే ఎమ్మెల్యే గా గెలిచి నేడు లంబాడి బిడ్డ పై బహిరంగ సభ లో దాడి చేయడం సరి కాదన్నారు. సేవాలాల్ జయంతి రోజు కూడా ఎమ్మెల్యే కోవ లక్ష్మి మైక్ వదిలేసి బంజారా/లంబాడి సమాజానికి అవమాన పరిచారు. అయినప్పటికీ లంబాడా సమాజం ఓపిక తోనే ఉన్నారని గుర్తు చేశారు. ఒక ఎమ్మెల్యే హోదాలో ఉండి ఇలా ప్రవర్తించడం సరి కాదన్నారు. బంజారా/లంబాడి నాయకులు అంటే మీకు అంత చిన్న చూపా.. ఎమ్మెల్యే అంటే స్థానిక ప్రజలు అందరినీ దృష్టిలో పెట్టుకొని తమ పాలన ఉండాలి కానీ ఇలా చేయడం తగదన్నారు. వెంటనే కోవలక్ష్మి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు..