Monday, March 23, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్కంఠాలి గ్రామములో సభ

కంఠాలి గ్రామములో సభ

- Advertisement -

నవతెలంగాణ – జక్కల్: కంఠాలి జిపిలో సర్పంచ్ నాగనాథ్ ఆధ్వర్యంలో గ్రామ సభ విజయవంతంగా సోమవారం నాడు నిర్వహించబడింది. ఈ కార్యక్రమం సర్పంచ్ నాగనాథ్, ఉప సర్పంచ్ బాబురావు సమక్షంలో జరిగిందని జిపి కార్యదర్శి తెలిపారు. గ్రామంలో ఉన్న ముఖ్య సమస్యలపై విస్తృతంగా చర్చ జరిగింది. ముఖ్యంగా గ్రామంలో నీటి సమస్యలపై సభ్యులు తమ అభిప్రాయాలు వ్యక్తం చేశారు. అదేవిధంగా కొత్తగా నిర్మించబడుతున్న ఇళ్లకు పేరుమార్పులు (నేమ్ ట్రాన్స్‌ఫర్) చేసుకోవడం గురించి కూడా చర్చించారు. ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి వాటర్ సప్లై అనుమతులు పొందడం, సరైన విధంగా నీటి సరఫరా అందించడం గురించి గ్రామ సభలో నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. గ్రామ అభివృద్ధికి సంబంధించిన పలు అంశాలపై ప్రజల సూచనలు తీసుకుని, వాటిని అమలు చేసే దిశగా చర్యలు తీసుకోవాలని నిర్ణయించారు. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు, మహిళలు యువకులు తదితరులు పాల్గొన్నారు. 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -