ఎక్స్‌లెన్స్ అవార్డులను ప్రదానం చేసిన గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
గణతంత్ర దినోవత్సవాన్ని పురస్కరించుకుని తెలంగాణ లోక్‌భవన్‌లో రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ఎట్ హోం కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమానికి పలువురు ప్రముఖులు, మేధావులు హాజరయ్యారు. ఈ సందర్భంగా గవర్నర్ తేనేటి విందు ఇచ్చారు. 2024 సంవత్సరంలో తొలిసారిగా ప్రారంభించిన ‘గవర్నర్ అవార్డ్స్ ఫర్ ఎక్సలెన్స్’ కార్యక్రమంలో భాగంగా 2025 సంవత్సరానికి గానూ ఎంపికైన వ్యక్తులు, సంస్థలకు సోమవారం అవార్డులు ప్రదానం చేశారు. వివిధ కీలక విభాగాలలో విశిష్ట స్వచ్ఛంద సేవలందించిన వ్యక్తులు, సంస్థలను గుర్తించి ఈ గౌరవ పురస్కారాలను అందజేశారు. సంబంధిత రంగాలలో ఉత్తమ సేవలు అందించిన అభ్యర్థుల నుంచి నవంబర్ 2025లో ఆన్‌లైన్, ఆఫ్‌లైన్ పద్దతిలో పలువురి నుంచి నామినేషన్లు స్వీకరించారు. కమిటీి అధ్యక్షులు భారత ప్రభుత్వ మాజీ కేంద్ర హోంశాఖ కార్యదర్శి, పద్మభూషణ్ అవార్డు గ్రహీత కె. పద్మనాభయ్య, సభ్యులుగా సి.ఆర్. బిశ్వాల్, డా. సునీతా కృష్ణన్, డా. చిన్నబాబు సుంకవల్లి, రమేష్ కాజా, శ్రీ జె. భవానీ శంకర్ తదితరులు నామినేషన్లను క్షుణ్ణంగా పరిశీలించి గవర్నర్ ఎక్స్‌లెన్స్ అవార్డు గ్రహీతలను ఎంపిక చేశారు.
అవార్డు గ్రహితలు వీరే
రమాదేవి కన్నెగంటి (మహిళా సాధికారత), తోడసం కైలాస్ (గిరిజనాభివృద్ధి), డాక్టర్ ప్రద్యుత్ వాఘ్రే (రూరల్ హెల్త్, మెడికల్ ఫిలాంత్రపీ), వి.రాజన్న (కార్పొరేట్ వాలంటీరింగ్) అవార్డులను అందుకున్నారు. వ్యక్తులతోపాటు నాలుగు స్వచ్ఛంద సంస్థలకు అవార్డ్సు అందజేశారు. ప్రతి అవార్డుకు రూ.2 లక్షల చొప్పున నగదు బహుమతితోపాటు ప్రశంసా పత్రాన్ని అందజేశారు. కార్యక్రమంలో హైకోర్టు సీజే ఏకే సింగ్, స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్, ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి, మంత్రులు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, ఇతర రాజకీయ పార్టీలకు చెందిన నాయకులు పాల్గొన్నారు.
తెలంగాణ లోక్‌భవన్‌లో ‘ఎట్‌హోం’
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



