Wednesday, February 18, 2026
E-PAPER
Homeమానవికెమికల్స్‌ లేకుండా ఇంట్లోనే

కెమికల్స్‌ లేకుండా ఇంట్లోనే

- Advertisement -

ప్రకృతి అందించిన అందాలలో గులాబీ సువాసనకే కాదు, దాని నీటికి కూడా ప్రత్యేక స్థానం ఉంది. చర్మాన్ని సహజంగా మెరుగుపరచడంలో రోజ్‌ వాటర్‌ బాగా పనిచేస్తుందని బ్యూటీ నిపుణులు చెబుతుంటారు. ముఖానికి సహజ కాంతిని తెచ్చే ఈ గులాబీ నీరు చర్మాన్ని హైడ్రేట్‌ చేస్తూ ఒక రిఫ్రెష్‌ ఫీలింగ్‌ను ఇస్తుంది. మార్కెట్లో లభించే రోజ్‌ వాటర్‌లో రసాయనాలు ఎక్కువగా ఉండటం వల్ల చాలామంది వీటికి దూరంగా ఉంటారు. అలాంటి వారికి ఇంట్లో తయారు చేసే స్వచ్ఛమైన రోజ్‌ వాటర్‌ నిజమైన వరం. కేవలం కొన్ని సులభమైన పదార్థాలతో ఇంట్లోనే తయారయ్యే ఈ రోజ్‌ వాటర్‌ కోసం ఒక కప్పు గులాబీ రేకులు, రెండు కప్పుల నీళ్లు, ఒక గ్లాస్‌ బాటిల్‌.

మొదటగా గులాబీ ఆకులను శుభ్రంగా కడిగి.. తక్కువ మంటపై వేడి చేసిన నీటిలో 10-15 నిమిషాలు ఉడికనివ్వాలి. నీరు గులాబీ రంగులోకి మారగానే స్టౌవ్‌ ఆఫ్‌ చేసి చల్లబడనివ్వాలి. తరువాత వాటిని వడకట్టి గాజు బాటిల్‌లో నింపేస్తే చాలు.. స్వచ్ఛమైన, కెమికల్‌ ఫ్రీ రోజ్‌ వాటర్‌ సిద్ధం అవుతుంది. అంతే కాదు.. ఇంట్లో చేసిన రోజ్‌ వాటర్‌ ప్రభావం మార్కెట్‌ ప్రాడక్ట్స్‌ కంటే చాలా స్వచ్ఛమైనది. ఉదయం నిద్రలేచిన వెంటనే ముఖానికి దీనిని స్ప్రే చేస్తే వాపు తగ్గి ఫేస్‌ రిఫ్రెష్‌గా మారుతుంది. చర్మంలో ఉన్న మలినాలను తొలగించి సహజ టోనర్‌లా పనిచేస్తుంది. మొహం అలసటగా కనిపించినా ఒక్క స్ప్రే చాలు.. ముఖంపై వెంటనే ఫ్రెష్‌ గ్లో కనిపిస్తుంది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -