Magazines

గిల్‌కు ఐదోసారి.. షెఫాలీకి రెండోసారి ఐసీసీ అవార్డు

2 గంటల క్రితం

Fifth ICC award for Gill... second for Shafali.
వెబ్ డెస్క్

ప్రచురించబడింది అక్టో 13, 2026 | 1 నిమిషాల చదవడం

నవతెలంగాణ- హైదరాబాద్ : భారత క్రికెటర్లు శుభ్‌మన్‌ గిల్‌, షెఫాలీ వర్మ ఐసీసీ ప్లేయర్‌ ఆఫ్‌ ద మంత్‌ అవార్డులను గెలుచుకున్నారు. సెప్టెంబర్‌ 2026కు సంబంధించి ప్రకటించిన పురుషుల విభాగంలో గిల్‌ ఐదోసారి ఈ పురస్కారాన్ని అందుకోగా.. మహిళల విభాగంలో షెఫాలీ రెండోసారి అవార్డును సొంతం చేసుకుంది. వెస్టిండీస్‌తో వన్డే సిరీస్‌లో గిల్‌ అద్భుత ప్రదర్శన చేశాడు. తొలి వన్డేలో 110 పరుగులు చేయగా.. రెండో మ్యాచ్‌లో 133 బంతుల్లో 223 పరుగులతో చెలరేగాడు. లక్ష్య ఛేదనలో అత్యంత వేగంగా డబుల్‌ సెంచరీ సాధించిన ఆటగాడిగా రికార్డు సృష్టించాడు.


మరోవైపు షెఫాలీ వర్మ ఆసియా కప్‌లో 360 పరుగులు చేయడంతో పాటు ఆరు వికెట్లు పడగొట్టింది. ఆసియా క్రీడల్లోనూ సత్తా చాటి బంగ్లాదేశ్‌తో సెమీఫైనల్లో అజేయంగా 100 పరుగులు, శ్రీలంకతో ఫైనల్లో 48 పరుగులు సాధించింది. ఒకే నెలలో పురుషుల, మహిళల విభాగాల్లో భారత ఆటగాళ్లు అవార్డులు గెలుచుకోవడం ఇది మూడోసారి. గతంలో 2024 జూన్‌లో జస్ప్రీత్‌ బుమ్రా, స్మృతి మంధాన.. 2025 సెప్టెంబర్‌లో అభిషేక్‌ శర్మ, స్మృతి మంధాన ఈ ఘనత సాధించారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్