200 యూనిట్లకు మించి విద్యుత్ వాడకం
తగ్గుతున్న జీరో బిల్లుల లబ్ధిదారులు
నవతెలంగాణ - మల్హర్ రావు
గృహజ్యోతి పథకం లబ్ధిదారులకు ఎల్నినో షాక్ ఇచ్చింది. పెరుగుతున్న ఉష్ణోగ్రతలతో మండలంలో విద్యుత్ వినియోగం పెరిగింది. ఫలితంగా జీరో బిల్లులు తగ్గి కరెంట్ బిల్లులు కట్టక తప్పడం లేదు. గత రెండు నెలలుగా విద్యుత్ వాడకాన్ని చూస్తుంటే పెరుగుతున్న ఉష్ణోగ్రతల తీరుకు అద్దం పడుతుంది.మరోవైపు వ్యవసాయానికి సైతం విద్యుత్ వినియోగం పెరిగింది. 200 యూనిట్లు వినియోగించిన ప్రజలకు మాత్రమే గృహజ్యోతి పథకం వర్తిస్తుంది.ప్రస్తుతం వర్షాకాల ముగిసి చలికాలం ప్రారంభమైంది.
అయినప్పటికీ ఎండలు దంచికొడుతుండటంతో ఉక్కపోత పెరిగింది. వేసవి రాకముందే ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. దీంతో ఇళ్లలో నిత్యం ఫ్యాన్లు తిరుగుతున్నాయి. అధిక విద్యుత్ వినియోగంతో గృహజ్యోతి లబ్ధిదారులకు బిల్లులు వస్తున్నాయి. మండలంలో మొత్తం 6,164 గృహ విద్యుత్ వినియోగదారులు ఉన్నారు. సెప్టెంబర్ లో 200 యూనిట్లకు మించి విద్యుత్ వినియోగించడంతో వెయ్యి మంది గృహజ్యోతి పథకానికి దూరమవడంతో లబ్ధిదారులు తగ్గిపోయారు. అక్టోబర్ వెయ్యి మందికి విద్యుత్ బిల్లులు వచ్చాయి. దీంతో లబ్దిదారులు లబోదిబోమంటున్నారు. వేసవి రాకముందే ఇలా బిల్లులు వస్తే అప్పటికి పరి స్థితులు ఎలా ఉంటాయోనని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.







కామెంట్‌లు (0)