Magazines

చెట్లు నరికివేతతో విద్యుత్ షార్ట్‌సర్క్యూట్

1 గంట క్రితం

short circuit
avatar
Shiva Kumar

ప్రచురించబడింది అక్టో 13, 2026 | 1 నిమిషాల చదవడం

కాలనీలో ఇంటి యజమానికి భారీ నష్టం.. పోలీసులకు ఫిర్యాదు

నవతెలంగాణ - గీసుకొండ

16వ డివిజన్ కీర్తినగర్ కాలనీలో అనుమతి లేకుండా చెట్లను నరికివేయడంతో విద్యుత్ షార్ట్‌సర్క్యూట్ జరిగి ఓ ఇంట్లోని ఎలక్ట్రికల్ సామగ్రి పూర్తిగా కాలిపోయిన ఘటన కలకలం రేపింది. బాధితుడు ఏడేళ్లు శివ తెలిపిన వివరాల ప్రకారం.. అదే కాలనీలో నివాసముంటూ ఎస్‌బీఐ బ్యాంకులో సెక్యూరిటీగా పనిచేస్తున్న బైరి రాజిరెడ్డి విద్యుత్  అధికారులకు సిబ్బందికిను ఎటువంటి సమాచారం ఇవ్వకుండా జాగ్రత్తలు పాటించకుండా చెట్లను నరికివేయడంతో అవి విద్యుత్ తీగలపై పడినట్లు ఆరోపించారు.


దీంతో షార్ట్‌సర్క్యూట్ జరిగి తన ఇంట్లోని ఎలక్ట్రికల్ సామగ్రి పూర్తిగా దగ్ధమై తీవ్ర నష్టం వాటిల్లిందని శివ ఆవేదన వ్యక్తం చేశారు.

ఈ విషయంపై బైరి రాజిరెడ్డి ని ప్రశ్నించగా, ఆయన దురుసుగా ప్రవర్తిస్తూ నిర్లక్ష్యంగా సమాధానమిచ్చినట్లు బాధితుడు ఆరోపించారు. దీంతో నష్టపోయిన ఏడేల్లి శివ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఈ ఘటనపై పోలీసులు విచారణ జరిపి తగిన చర్యలు తీసుకోవాలని బాధితుడు కోరాడు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్