Magazines

అర్హులైన వారికే పెన్షన్లు : డీపీఓ

1 గంట క్రితం

Pensions
avatar
Shiva Kumar

ప్రచురించబడింది అక్టో 13, 2026 | 1 నిమిషాల చదవడం

దరఖాస్తులపై క్షేత్రస్థాయి పరిశీలన

నవతెలంగాణ–నర్సింహులపేట

అర్హులైన లబ్ధిదారులకే పెన్షన్లు మంజూరయ్యేలా చర్యలు తీసుకుంటామని జిల్లా పంచాయతీ అధికారి (డీపీఓ) రేవంత్ తెలిపారు. మంగళవారం నర్సింహులపేట మండలం పకీర తండా గ్రామపంచాయతీలో సర్పంచ్ గుగులోతు కైలా రవి నాయక్‌తో కలిసి కొత్త పెన్షన్ల కోసం వచ్చిన దరఖాస్తులను క్షేత్రస్థాయిలో పరిశీలించారు.


దరఖాస్తుదారుల అర్హతలను క్షుణ్ణంగా పరిశీలించి, ప్రభుత్వ నిబంధనల ప్రకారం పెన్షన్ల మంజూరుకు చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. అనంతరం తొలిసారిగా గ్రామపంచాయతీ కార్యాలయానికి వచ్చిన డీపీఓ రేవంత్‌ను సర్పంచ్ కైలా రవి నాయక్, ఉపసర్పంచ్ గుగులోతు కిషన్ నాయక్ శాలువాతో సన్మానించారు. కార్యక్రమంలో ఎంపీఓ అశోక్, పంచాయతీ కార్యదర్శి బి. సరిత, వార్డు సభ్యులు, గ్రామస్తులు పాల్గొన్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్