Magazines

ఆర్చరీ లీగ్‌‌పై ఫోకస్‌!

1 గంట క్రితం

Archery League!
avatar
balaji

ప్రచురించబడింది అక్టో 05, 2026 | 1 నిమిషాల చదవడం

ఆసియా క్రీడల్లో ఫామ్‌‌లో ఆర్చర్లు
హైదరాబాద్‌ వేదికగా ఏపీఎల్‌ సీజన్‌2


నవతెలంగాణ-హైదరాబాద్‌ : ఆసియా క్రీడల్లో పతక మోత మోగించిన భారత ఆర్చర్లు.. ఆర్చరీ ప్రీమియర్‌ ‌లీగ్‌ (ఏపీఎల్‌)‌పై అంచనాలను భారీగా పెంచారు. కాంపౌండ్‌, రికర్వ్‌ ‌విభాగాల్లో భారత ఆర్చర్లు ఐదు స్వర్ణాలు సహా తొమ్మిది పతకాలు సాధించిన సంగతి తెలిసిందే. ఈ నెల 8 నుంచి హైదరాబాద్‌ ‌వేదికగా ఆర్చరీ ప్రీమియర్‌ ‌లీగ్‌ (ఏపీఎల్‌) ఆరంభం కానుండటంతో.. ఇప్పుడు అందరి దృష్టి అటువైపే పడింది. కుమ్‌‌కుమ్‌ అనిల్‌ ‌మొహోద్‌ (17) ‌రికర్వ్‌ ‌విభాగంలో భారత్‌కు పసిడి పతకం సాధించిన తొలి ఆర్చర్‌‌గా చరిత్ర సృష్టించింది. జ్యోతి సురేఖ, చికితలు జట్టు విభాగాల్లో పసిడి పతకాలు సాధించేందుకు దోహదం చేశారు. ఆర్చరీ ప్రీమియర్‌ ‌లీగ్‌‌లో ఈ ఫామ్‌ ‌కొనసాగనుండటంతో లీగ్‌‌పై అంచనాలు అమాంతం పెరిగిపోయాయి. ఆర్చరీ ప్రీమియర్‌ ‌లీగ్‌‌లో ఆరు ప్రాంఛైజీలకు 48 మంది ఆర్చర్లు రికర్వ్‌, కాంపౌండ్‌ ‌విభాగాల్లో ప్రాతినిథ్యం వహిస్తున్నారు. ఆర్చరీ ప్రీమియర్‌ ‌లీగ్‌‌లో ప్రతి షాట్‌‌కు 15 సెకండ్ల గడువు నిబంధన ఉండటంతో.. ఆర్చర్లు ఒత్తిడిలో వేగంగా నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది. ఇది పోటీతత్వాన్ని మరింత రక్తికట్టించనుంది. ఆసియా క్రీడల్లో పతక ప్రదర్శన కనబరిచిన భారత, విదేశీ ఆర్చర్లతో పాటు భారత వెటరన్‌ ఆర్చర్లు దీపికా కుమారి, అటాను దాస్‌‌లు సైతం ఆర్చరీ ప్రీమియర్‌ ‌లీగ్‌‌లో సత్తా చాటేందుకు ఎదురుచూస్తున్నారు. ఆర్చరీ ప్రీమియర్‌ ‌లీగ్‌ ‌రెండో సీజన్‌ ‌హైదరాబాద్‌‌లోని నెక్లస్‌‌రోడ్‌‌లోని పీపుల్స్‌ ‌ప్లాజా వేదికగా జరుగనుంది.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్