మళ్లీ ముంబయి ఇండియన్స్ పగ్గాలు
ముంబయి : ఐపీఎల్‌లో అత్యంత విజయవంతమైన కెప్టెన్, ముంబయి ఇండియన్స్‌కు ఐదు టైటిల్స్ అందించిన రోహిత్ శర్మ మళ్లీ ఆ ప్రాంఛైజీ సారథ్య పగ్గాలు చేపట్టాడు. వచ్చే ఐపీఎల్ నాటికి 40 వసంతాలు పూర్తి చేసుకోనున్న రోహిత్ శర్మ.. 2023లో ముంబయి ఇండియన్స్ కెప్టెన్‌గా తప్పుకున్నాడు. గుజరాత్ టైటాన్స్ నుంచి హార్దిక్ పాండ్యను ట్రేడ్ చేసుకున్న ముంబయి ఇండియన్స్ గత మూడు సీజన్లు అతడి సారథ్యంలో టైటిల్ వేటకు వెళ్లి భంగప డింది. ముంబయి ఇండియన్స్ అభిమాను లు సైతం హార్దిక్ పాండ్యను ట్రోల్ చేశారు. దీంతో హార్దిక్ పాండ్యను పంజా బ్ కింగ్స్‌కు ఇచ్చి, బదులుగా అర్ష్‌దీప్ సింగ్‌ను తీసుకున్న సంగతి తెలిసిందే. 20వ సీజన్‌లో కెప్టెన్సీ రేసులో సూర్య కుమార్ యాదవ్, జశ్‌ప్రీత్ బుమ్రా,తిలక్ వర్మ పేర్లు వినిపించాయి. 2013, 2015, 2017, 2019, 2020 సీజన్లలో ముంబ యి ఇండియన్స్‌ను ఐపీఎల్ విజేతగా నిలిపిన రోహిత్ శర్మ వైపే యాజమాన్యం మొగ్గుచూపటంతో మరోసారి అతడికి కెప్టెన్సీ పగ్గాలు దక్కాయి. ముంబయి ఇండియన్స్‌కు రోహిత్ శర్మ 163 మ్యాచ్‌ల్లో కెప్టెన్సీ వహించగా 93 విజయాలు, 70 ఓటములు చవిచూశాడు.






కామెంట్‌లు (0)