సయ్యద్ ముస్తాక్ అలీ టీ20 టోర్నీ
కోల్‌కతా : రంజీ ట్రోఫీలో రాణించిన హైదరాబాద్.. అదే జోరు సయ్యద్ ముస్తాక్ అలీ టీ20లో చూపించలేదు. ఎలైట్ గ్రూప్-డిలో ముంబయితో మ్యాచ్‌లో హైదరాబాద్ చిత్తుగా ఓడింది. అభిరథ్ రెడ్డి (35), హిమతేజ (25), సీవీ మిలింద్ (22) రాణించగా తొలుత హైదరాబాద్ 20 ఓవర్లలో 172 పరుగులకు ఆలౌటైంది. ముంబయి ఆ లక్ష్యాన్ని 13.1 ఓవర్లలోనే ఊదేసింది. సూర్యకుమార్ యాదవ్ (60 నాటౌట్, 21 బంతుల్లో 6 ఫోర్లు, 5 సిక్స్‌లు), ముషీర్ ఖాన్ (51, 24 బంతుల్లో 6 ఫోర్లు, 3 సిక్స్‌లు) అర్థ సెంచరీలతో దంచికొట్టారు. సూర్యకుమార్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచాడు.





కామెంట్‌లు (0)