ఈ రోజే ఈ రోజే
బాలల పండుగ ఈ రోజే
ఈనాడే ఈనాడే
పిల్లల పండుగ ఈనాడే
మాదేలే మాదేలే
నింగినేలా మాదేలే
మావేలే మావేలే
ఆటలుపాటలు మావేలే
మేమేలే మేమేలే
ఇంటాబయటా మేమేలే
మావేలే మావేలే
అల్లరి పనులు మావేలే
మాదేలే మాదేలే
రంగుల లోకం మాదేలే
మావేలే మావేలే
ఊహల రెక్కలు మావేలే
మాకేలే మాకేలే
ముచ్చటలన్నీ మాకేలే
మావేలే మావేలే
నవ్వుల పువ్వులు మావేలే
ఈరోజే ఈ రోజే
పిల్లల పండుగ ఈ రోజే
ఈనాడే ఈనాడే
సందడంతా ఈనాడే
డా.హారిక చెరుకుపల్లి, 9000559913






కామెంట్‌లు (0)