Magazines

గాయం...

16 నిమిషాల క్రితం

Injury
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 15, 2026 | 2 నిమిషాల చదవడం

పొద్దు పొద్దున్నే పిట్ట వొకటి నండింట్లో వాలింది మనుషుల్ని చూడక ఎన్నో ఏండ్లయినట్టు తన వాళ్ళకు టాటా చెప్పి మనిషి పలకరింపు కొరకు మూల మూలన తండ్లాడుతున్నది ఇంట్లో ఎన్ని సెల్లుఫోనులున్నాయో కనిపెట్టి నాయకుడికి ఉప్పందించడానికి వచ్చిన గూఢచారిలా బాల్యంలో తప్పిపోయి మీసం మొలిచాక ఇల్లు చేరినట్టు విదేశాల నుండి స్వదేశానికి తిరిగి వచ్చిన భారతీయుడిలా భూదందా పడగ నీడలో పుల్ల కూడా దొరకని ఎడారులయిన అడవులెన్ని దాటి వచ్చిందో అప్పుడెప్పుడో గూడు కట్టుకున్న ఇంటిని పావనం చేసింది గింజలు చల్లి పిట్టల రెక్కల చప్పుడు విన్న నాటి జ్ఞాపకాల పూలకొమ్మ దులిపింది పాలపిట్ట అగుపడక ప్రతి దసరా చిన్నబోతున్నది పిట్ట కనపడకపోతే భూమి మీది మనిషి ఎప్పుడూ ఒంటరే జాడ లేని పిట్ట అగుపడితే మనమంతా చంటిపిల్లలమే పిట్ట నేలమీద వాలే నక్షత్రం వాకిట్లో విరబూసే చిట్టి ముక్కు చందమామ రెక్కలు మొలిచిన చెట్టు మీది పువ్వు ఏ వేలు తాకని విద్యుత్తు తీగ మీది సుస్వరం ఏ చెట్ల కొమ్మల చాటున దాక్కుంటందో చూపులో పడని కూత ఘనం పిట్ట పార్కుల చుట్టూ తిరిగే ప్రేమలా ఇండ్ల చుట్టూ తిరిగే వలపు గీతం ప్రేమదారం పుటుక్కున తెగిపోయే ప్రేమ పెండ్లిండ్ల నడుమ జంటగా వచ్చి పిల్లలతో కలిసి ఎగిరిపోయే చింతలేని కుటుంబం వొంట్లో ఉన్న బీపీ షుగర్ ఆందోళనల నడుమ నిత్యం పెరుగుతున్న నిత్యావసరాల అధిక ధరల ముళ్ళకంప గీరుకుపోతున్న కాలం ఎళ్ళీ ఎళ్ళని జీతగాళ్ళం చిరకాల మిత్రుడు ఎదురుపడినా పలుకరించే తీరిక లేని యంత్రాలం మర్యాద సరిగ్గా అందకపోతే చుట్టం చూపుగా వచ్చిన వాడు అలిగి వెళ్ళిపోతాడు మళ్ళీ రాకడ ఎప్పుడో అసలు వస్తాడో లేదో అంతా సెల్లు టవర్ పుణ్యం పాటకో పద్యానికో ముద్దుకో మురిపానికో సందేశానికో సంతాపానికో పిట్ట మన నేస్తం ఒక పక్షి నేలకొరిగి వొకకంటి కన్నీరు కావ్యమయిన మట్టిలో మానవ మేథస్సు పక్షి జాతికి యమపాశమవుతున్నది పక్షి లోకం కంటపడని వియోగం రసి కారుతున్నది.

గజ్జెల రామకృష్ణ, 9877412795

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్