Magazines

నేటి నుంచి అఖిలభారత కిసాన్‌ సభ

18 నిమిషాల క్రితం

All India Kisan Sabha
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 15, 2026 | 2 నిమిషాల చదవడం

నల్లగొండ మర్రిగూడ బైపాస్‌ నుంచి రైతు మహాప్రదర్శన

​ నవతెలంగాణ- నల్లగొండ ప్రాంతీయ ప్రతినిధి

దేశవ్యాప్తంగా రైతాంగం ఎదుర్కొంటున్న సమస్యలపై చర్చలు, భవిష్యత్‌ రైతు ఉద్యమాలకు దిశానిర్దేశం చేసే లక్ష్యంతో నిర్వహిస్తున్న 36వ అఖిల భారత కిసాన్‌ సభ మహాసభకు నల్లగొండ నగరం ముస్తాబైంది. తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట చరిత్రకు సాక్షిగా నిలిచిన నల్లగొండ గడ్డపై నేటి నుంచి 18వ తేదీ వరకు జరగనున్న మహాసభకు ఏర్పాట్లు పూర్త య్యాయి. తొలి రోజైన ఆదివారం నగరంలో రైతుల మహా ప్రదర్శన, ఎన్‌జీ కాలేజీ ప్రాంగణంలో లక్ష మందితో బహిరంగ సభ నిర్వహించనున్నారు. ఈ సభకు జాతీయ సీనియర్‌ నాయకురాలు, మాజీ ఎంపీ బృందా కారత్‌ హాజరు కానున్నారు.

మధ్యాహ్నం 12 గంటలకు రైతు మహాప్రదర్శన

​ఆదివారం మధ్యాహ్నం 12 గంటలకు మర్రిగూడ బైపాస్‌ నుంచి రైతు మహాప్రదర్శన ప్రారంభమై బహిరంగ సభ వేదిక ఎన్‌‌జీ కాలేజీ వరకు కొనసాగుతుంది. దేశంలోని వివిధ రాష్ట్రాల నుంచి తరలివచ్చే రైతు ప్రతినిధులు, స్థానిక రైతులు, కార్మికులు, ప్రజాసంఘాల కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన నున్నారు. రెడ్‌షర్ట్‌ వాలంటీర్ల కవాతు ప్రత్యేక ఆకర్షణగా నిలవ నుంది. సభలో అఖిల భారత కిసాన్‌ సభ జాతీ య అధ్యక్షు లు అశోక్‌ ధావలే, ప్రధాన కార్యదర్శి విజ్జూకృష్ణన్‌, తెలంగాణ రాష్ట్ర అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు పోతినేని సుదర్శన్‌, తీగల సాగర్‌, రాష్ట్ర ఆహ్వాన సంఘం అధ్యక్షులు జూలకంటి రంగారెడ్డి, మాజీ ఎమ్మెల్యే నంద్యాల నర్సిరెడ్డితోపాటు జాతీయ, రాష్ట్ర స్థాయి నాయకులు ప్రసంగిస్తారు.

​ రైతు సమస్యలపై కీలక చర్చలు.. తీర్మానాలు

​నాలుగు రోజుల మహాసభలో దేశవ్యాప్తంగా వ్యవసాయ రంగం ఎదుర్కొంటున్న సంక్షోభం, రైతుల హక్కులు, పంటలకు గిట్టుబాటు ధరలు, వ్యవసాయ విధానాలు, రైతాంగ ప్రయోజనాల పరిరక్షణ తదితర అంశాలపై విస్తృత చర్చలు జరగనున్నాయి. పలు కీలక తీర్మానాలను ప్రవేశపెట్టనున్నారు. వివిధ రాజకీయ రంగాలకు చెందిన నాయకులు, సంయుక్త కిసాన్‌ మోర్చా నాయకుల సందేశాలను సభలో వినిపిస్తారు. ​జాతీయ స్థాయిలో భవిష్యత్‌ రైతు ఉద్యమాల కార్యాచరణకు దిశానిర్దేశం చేసేలా చర్చలు, నిర్ణయాలు ఉండనున్నాయి.
hh

​ ఏర్పాట్లను పరిశీలించిన జాన్‌వెస్లీ

బహిరంగ సభ ఏర్పాట్లను శనివారం సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి జాన్‌వెస్లీ పరిశీలించారు. ఏఐకేఎస్‌ జాతీయ కార్యదర్శి విజ్జూ కృష్ణన్‌, పోతినేని సుదర్శన్‌, తీగల సాగర్‌, జూలకంటి రంగారెడ్డి, ఐద్వా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మల్లు లక్ష్మి, సీపీఐ(ఎం) రాష్ర్ట కార్యదర్శి వర్గ సభ్యులు అబ్బాస్‌ , బండారు రవికుమార్‌, జిల్లా కార్యదర్శి తుమ్మల వీరారెడ్డితో కలిసి సభా ప్రాంగణాన్ని సందర్శించి ఏర్పాట్లను పర్యవేక్షిం చారు. ఈ సందర్భంగా జాన్‌వెస్లీ మాట్లాడుతూ.. రైతాంగ శ్రేయస్సు కోరుతూ తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట గడ్డపై జరుగుతున్న 36వ జాతీయ మహాసభను రైతులు, కార్మికులు, సబ్బండ వర్గాలు భాగస్వాములై విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. రైతుల సమస్యలు, వ్యవసాయ రంగ పరిరక్షణపై జాతీయ స్థాయిలో చర్చలు జరగనున్న నేపథ్యంలో ఈ మహాసభకు విశేష ప్రాధాన్యత ఉందన్నారు.​

16న జెండా ఆవిష్కరణతో 
ప్రతినిధుల సభ ప్రారంభం

మహాసభ ప్రధాన కార్యక్రమాలు నల్లగొండలోని గుండె మైసయ్య కన్వెన్షన్‌ హాల్‌ వేదికగా జరగనున్నాయి. ఈ నెల 16న ఉదయం 9 గంటలకు జెండా ఆవిష్కరణతో ప్రతినిధుల సభ ప్రారంభమవుతుంది. అనంతరం ప్రారంభ సభ, అఖిల భారత కిసాన్‌ సభ జాతీయ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శుల అధ్యక్షోపన్యాసాలు, ప్రతినిధుల ప్రసంగాలు ఉంటాయి.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్