Magazines

విజేత గోవా ఈగల్స్‌

12 నిమిషాల క్రితం

Winner: Goa Eagles
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 15, 2026 | 1 నిమిషాల చదవడం

నవతెలంగాణ-హైదరాబాద్‌ : ఐజీపీఎల్‌ ‌సరికొత్తగా ప్రవేశపెట్టిన టీమ్‌ ఈవెంట్ ఫార్మాట్‌ ఎక్స్‌ ‌గోల్ఫ్‌‌లో గోవా ఈగల్స్‌ ‌జీసీ విజేతగా నిలిచింది. శనివారం బౌల్డర్‌ హిల్స్‌ ‌గోల్ఫ్‌ కోర్స్‌‌లో జరిగిన ఎక్స్‌ ‌గోల్ఫ్‌ ‌పోటీల్లో పది జట్లు పోటీపడగా మూడు రౌండ్ల ఎలిమినేషన్‌ ఎదుర్కొని గోవా ఈగల్స్‌ ‌టైటిల్‌ ‌సాధించింది. స్కూల్‌ ‌విద్యార్థులు ఎక్స్‌ ‌గోల్ఫ్‌ ఈవెంట్‌‌కు ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ఈ కార్యక్రమంలో ఏఎం గ్రీన్‌‌ను ఇండియన్‌ ‌గోల్ఫ్‌ ‌టైటిల్‌ ‌స్పాన్సర్‌‌గా ప్రకటించారు.

ఫీనిక్స్‌ ఇన్విటేషనల్‌ గోల్ఫ్‌ టోర్నీ విజేతగా నిలిచిన గగన్‌జీత్‌ భుల్లార్‌కు రూ.22.50 లక్ష‍ల నగదు బహుమతిని ఎంపీలు కృష్ణప్రసాద్‌, సిఎం రమేశ్‌, రాష్ర్ట ప్రభుత్వ సలహాదారు శివధర్‌ రెడ్డి తదితరులు అందజేశారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్